Sat Dec 21 2024 13:51:24 GMT+0000 (Coordinated Universal Time)
Huawei Mate Xs 2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్.. ధర ఎంతంటే
THuawei Mate Xs 2 ధరను CNY 9,999 (భారత కరెన్సీలో Rs. 1,15,850) నిర్ణయించారు. అది కూడా బేస్ వేరియంట్ అయిన..
Huawei కంపెనీ Mate Xs 2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. Huawei Mate Xs 2 ఫిబ్రవరి- 2020లో విడుదల చేసిన Huawei Mate Xsకి వారసుడిగా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 7.8-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ లో Qualcomm Snapdragon 888 SoC ప్రాసెసర్, 4G కనెక్టివిటీ కూడా ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో అమర్చబడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది Huawei M-Pen 2sకి మద్దతును ఇస్తుంది. Huawei కంపెనీ Mate Xs 2తో పాటు, MatePad SE బడ్జెట్ టాబ్లెట్‌ను కూడా విడుదల చేసింది.
THuawei Mate Xs 2 ధరను CNY 9,999 (భారత కరెన్సీలో Rs. 1,15,850) నిర్ణయించారు. అది కూడా బేస్ వేరియంట్ అయిన 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసమే..! ఇక 8GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 11,499 (1,33,200 రూపాయలుగా) నిర్ణయించారు. Huawei Mate Xs 2 కలెక్టర్స్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది.. ఈ ఎడిషన్ లో 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ లభిస్తుంది. ఈ వేరియంట్ ధర CNY 12,999 (1,50,600 రూపాయలు)గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్రొకేడ్ వైట్, ఎలిగెంట్ బ్లాక్, ఫ్రాస్ట్ పర్పుల్ రంగుల్లో మే 6 నుండి అందుబాటులోకి రానుంది.
Huawei MatePad SE ధర, లభ్యత
Huawei MatePad SE Wi-Fi-మాత్రమే ఉండే 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,499 (దాదాపు రూ. 17,400)గా నిర్ణయించబడింది. 4GB RAM + 128GB నిల్వతో Wi-Fi + LTE వేరియంట్ ధర CNY 1,699 (దాదాపు రూ. 19,700)గా ఉంది. ఇది ముదురు నీలం రంగులో మే 6 నుండి అందుబాటులో ఉంటుంది.
Huawei Mate Xs 2 స్పెసిఫికేషన్లు
డ్యూయల్-సిమ్ (నానో) Huawei Mate Xs 2 HarmonyOS 2పై రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ఎక్స్పెండబుల్ 7.8 అంగుళాలు (2,480x2,200 పిక్సెల్‌లు), ఫోల్డ్ చేసిన స్థితిలో 6.5 అంగుళాలు (1,176x2,480 పిక్సెల్‌లు)ఉంటుంది. గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 424ppi పిక్సెల్ డెన్సిటీతో OLED డిస్ప్లే కలిగి ఉంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 888 4G SoC తో వస్తుంది. గరిష్టంగా 12GB RAMతో వస్తుంది. Huawei Mate Xs 2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
ఇది f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో జత చేయబడిన 13-మెగాపిక్సెల్ సెన్సార్ , f/2.4 టెలిఫోటో లెన్స్, OIS సపోర్ట్‌తో జత చేయబడిన 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్, 30x డిజిటల్ జూమ్‌కు మద్దతు ఇస్తుందని Huawei తెలిపింది. సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం.. హ్యాండ్సెట్ f/2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో జత చేయబడిన 10.7-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
Next Story