భారతదేశంలో లాంఛ్ అయిన వన్ ప్లస్ 10 ప్రో
భారతదేశంలో OnePlus 10 Pro 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం ప్రారంభ ధర 66,999గా ఉంచారు. ఫోన్ 12GB + 256GB స్టోరేజ్..
ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 10 Pro భారతదేశంలో ప్రారంభించబడింది. OnePlus ఫోన్ టాప్-నాచ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCతో వస్తుంది, స్నాప్‌డ్రాగన్ చిప్ కంటే నాలుగు రెట్లు వేగవంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాసెసింగ్, 25 శాతం ఎక్కువ సమర్థవంతమైన గ్రాఫిక్స్ తో తీసుకుని వచ్చారు. ఈ సరికొత్త మొబైల్ లో Snapdragon SoCతో పాటు, OnePlus 10 Pro OnePlus 9 Proలో మెరుగైన AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన ఛార్జింగ్ సొంతం. ఇచ్చిన స్పెసిఫికేషన్లు, ధరలతో చూస్తే OnePlus 10 Pro Samsung Galaxy S22, iPhone 13 వంటి వాటితో పోటీపడుతుంది.
గత సంవత్సరం, OnePlus 9 ప్రో 8GB + 128GB స్టోరేజ్ మోడల్ కోసం 64,999 రూపాయలుగా నిర్ణయించారు. 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం 69,999గా నిర్ణయించారు. OnePlus 10 Pro జనవరిలో చైనాలో 8GB + 128GB మోడల్‌కు CNY 4,699 (సుమారు రూ. 56,100)తో ప్రారంభించబడింది. ఇక 8GB + 256GB వేరియంట్ లో భాగంగా CNY 4,999 (దాదాపు రూ. 59,700), టాప్-ఎండ్ 12GB + 256GB వేరియంట్ CNY 5,299 (దాదాపు రూ. 63,200) వద్ద ఉంచారు.