Sat Dec 21 2024 13:41:54 GMT+0000 (Coordinated Universal Time)
ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకుని రానున్న వన్ ప్లస్.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే!
వన్ ప్లస్ తీసుకుని వచ్చే ఫోల్డబుల్ ఫోన్ ఖచ్చితంగా Oppo Find N యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అవుతుందని టెక్ నిపుణులు..
OnePlus సంస్థ ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకుని రావాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే..! అయితే రాబోయే OnePlus ఫోల్డబుల్ ఫోన్ మనం ఇప్పటికే చూసిన మోడల్ అని అంటున్నారు. Oppo Find N యొక్క రీబ్యాడ్జ్డ్ వెర్షన్ అనే పుకారు మొదలైంది. Oppo Find N, రాబోయే OnePlus ఫోల్డబుల్ ఫోన్ మధ్య ఒకే ఒక వ్యత్యాసం తప్ప మిగతా అంతా.. సేమ్ టు సేమ్ అనే పుకార్లు వ్యాపించాయి. BBK ఎలక్ట్రానిక్స్ కింద వన్‌ప్లస్, ఒప్పోలకు ఒకే ఓనర్లు ఉన్నారనే సంగతి తెలిసిందే. అందువల్ల OnePlus దాని మొదటి ఫోల్డబుల్ ఫోన్‌గా రీబ్రాండెడ్ Oppo Find Nని లాంచ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
వన్ ప్లస్ తీసుకుని వచ్చే ఫోల్డబుల్ ఫోన్ ఖచ్చితంగా Oppo Find N యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అవుతుందని టెక్ నిపుణులు అంటున్నారు. Find N మొబైల్ ను ఒప్పో భారతదేశంలో లేదా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రారంభించలేదు. ఇక OnePlus ఫోల్డబుల్ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ గురించి ఎటువంటి సమాచారం లేదు. OnePlus ఈ సంవత్సరం ఐదు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది, అయితే ఫోల్డబుల్ ఫోన్ ఇంకా జాబితాలో కనిపించలేదు.
Oppo Find N ధర
Oppo Find N రెండు RAM వేరియంట్లతో 8GB RAM- 256GB స్టోరేజ్ తో రానుంది. ధర CNY 7,699గా ప్రకటించబడింది, భారత్ కరెన్సీలో 92,000 రూపాయలు. ఇక 12GB RAM - 512GB స్టోరేజ్ ఉన్న దాని ధర CNY 8,999, ధర దాదాపు రూ. 1,07,550గా ఉంది. స్మార్ట్‌ఫోన్ మూడు రంగులలో ప్రారంభించబడింది. ఇది చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది.
Oppo Find N: స్పెసిఫికేషన్లు
Oppo Find N పెద్ద 7.1-అంగుళాల LTPO AMOLED డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ మద్దతుతో 1920x1792 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్ ఉంది. Oppo Find N Qualcomm Snapdragon 888 చిప్సెట్తో 12GB వరకు RAM.. 512GB UFS 3.1 స్టోరేజ్‌తో అందించబడింది. స్మార్ట్‌ఫోన్ ColorOS 12 ఆధారంగా ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్‌ని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, Find N WiFi 6 సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరిన్నింటితో వస్తుంది. ఇది 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
Next Story