Sun Dec 22 2024 01:35:13 GMT+0000 (Coordinated Universal Time)
లీకైన ఒప్పో F21 ప్రో, ఒప్పో F21 ప్రో 5G మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్స్
Oppo F21 Pro.. Android 12 ఆధారిత ColorOS 12.1 పై రన్ అవుతుంది. Oppo F21 Pro 5G ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS 12 పై రన్..
Oppo F21 Pro సిరీస్ లో భాగంగా Oppo F21 Pro, Oppo F21 Pro 5G మోడల్స్ రానున్నాయి. ఈ సిరీస్ మొబైల్స్ ను ఏప్రిల్ 12న భారతదేశంలో లాంఛ్ చేయనున్నారు. అధికారిక ప్రకటనకు ముందు, హ్యాండ్సెట్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లతో పాటు ధర వివరాలు కూడా ఆన్లైన్లో లీక్ అయ్యాయి. తాజా లీక్ ప్రకారం.. Oppo F21 ప్రో సిరీస్ ఫోన్లు 64-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో, ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటాయి. ఇవి 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో వస్తాయని భావిస్తూ ఉన్నారు. Oppo F21 ప్రో 4G వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 680 ద్వారా రాబోతుండగా, 5G వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 695 SoC తో రానుంది.
భారతదేశంలో Oppo F21 ప్రో సిరీస్ ధర (అంచనా)
కొందరు ఒప్పో F21 ప్రో సిరీస్ యొక్క భారతదేశ ధర వివరాలను ట్విట్టర్లో లీక్ చేశారు. లీక్ ప్రకారం, Oppo F21 ప్రో మార్కెట్ ఆపరేటింగ్ ధర (MOP) రూ. 22,000 గా ఉండవచ్చు.. Oppo F21 5G ధర 26,000 రూపాయలు ఉండవచ్చు. Oppo F21 Pro, Oppo F21 Pro 5G అందుబాటులో ఉండే రంగులు, వేరియంట్ స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. లీక్ ల ప్రకారం Oppo F21 ప్రో కాస్మిక్ బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో రానుంది. 5G వేరియంట్ కాస్మిక్ బ్లాక్, రెయిన్బో స్పెక్ట్రమ్ షేడ్స్‌లో వస్తుందని భావిస్తున్నారు.
Oppo F21 Pro.. Android 12 ఆధారిత ColorOS 12.1 పై రన్ అవుతుంది. Oppo F21 Pro 5G ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS 12 పై రన్ అవుతుందని లీక్ లలో చెప్పారు. లీక్ ప్రకారం, Oppo F21 ప్రో సిరీస్ ఫోన్లు 6.43-అంగుళాల పూర్తి-HD AMOLED డిస్ప్లేను కలిగి ఉంటాయి. Oppo F21 Pro 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది, 5G వేరియంట్ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుందని చెప్పబడింది. Qualcomm స్నాప్‌డ్రాగన్ 680 SoC Oppo F21 ప్రోకి పవర్ ఇస్తుందని భావిస్తున్నారు. 5G వేరియంట్ కు స్నాప్‌డ్రాగన్ 695 SoC అమర్చబడింది.
Oppo F21 ప్రో సిరీస్ 64-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ తో రానుంది. కెమెరా సెటప్‌లో రెండు 2-మెగాపిక్సెల్ డెప్త్, మాక్రో సెన్సార్లు కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ IMX709 సెన్సార్‌ను కలిగి ఉంటుంది. Oppo F21 Pro 5G ఫోన్ 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రెండు హ్యాండ్సెట్లు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ తో వస్తాయి. లీక్ ప్రకారం, Oppo F21 Pro 159.9x73.2x7.49/7.54mm తో రానుండగా.. 175 గ్రాముల బరువు ఉంటుంది. 5G మోడల్ 159.85x73.17x7.49/7.55mm తో 173 గ్రాముల బరువుతో వస్తుంది. Oppo F21 ప్రో సిరీస్‌ను ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంటలకు ISTకి ప్రారంభించనున్నట్లు ఒప్పో సంస్థ ఇటీవలే ధృవీకరించింది.
Next Story