Sat Dec 21 2024 14:24:54 GMT+0000 (Coordinated Universal Time)
భారతదేశంలో MIUI 13 అప్డేట్ తో రానున్న Poco F3 GT
Poco F3 GTలోని ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (f/1.65 ఎపర్చరు), 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్..
Poco F3 GT మొబైల్ ఫోన్ కు Android 12 ఆధారిత MIUI 13 అప్డేట్ వచ్చింది. Poco నుండి వచ్చిన ఈ మొబైల్ హ్యాండ్సెట్ గత ఏడాది జూలైలో భారతదేశంలో ప్రారంభించబడింది. Poco F3 GT ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 12.5 తో రన్ అవుతూ వచ్చింది. ఈ నెల ప్రారంభంలో, భారతదేశంలోని Xiaomi Mi 11 Lite వినియోగదారులు MIUI 13 అప్డేట్ ను అందుకున్నారు. తాజా అప్డేట్ Mi 11 Lite కు రెండవ MIUI అప్‌గ్రేడ్ గా చెబుతున్నారు.. అంతే కాకుండా ఆయా మొబైల్స్ కు మొదటి Android వెర్షన్ అప్‌గ్రేడ్ గా చెబుతున్నారు.
Poco ఒక ట్వీట్ ద్వారా ఈ అప్డేట్ని ప్రకటించింది. వినియోగదారులు Poco కమ్యూనిటీ వెబ్‌పేజీ నుండి వారి అప్డేట్లను పొందవచ్చు. Xiaomi Mi 11 Lite కొన్ని రోజుల క్రితం అదే అప్డేట్ ను పొందింది. కొత్తగా వాల్‌పేపర్స్, నోటిఫికేషన్ ప్యానెల్‌కి కొన్ని లేఅవుట్స్ ఇంప్రూవ్మెంట్స్ వంటివి కొత్త అప్డేట్తో స్మార్ట్‌ఫోన్ లోకి చేరాయి.
Poco F3 GT స్పెసిఫికేషన్స్
స్పెసిఫికేషన్ల పరంగా.. Poco F3 GT 6.67-అంగుళాల టర్బో AMOLED 10-బిట్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. HDR 10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంది. DC డిమ్మింగ్‌కు కూడా మద్దతు ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 1200 SoC ద్వారా ఆధారితంగా పని చేస్తుంది. గరిష్టంగా 8GB RAM, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది.
Poco F3 GTలోని ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (f/1.65 ఎపర్చరు), 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ (119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ), 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ప్రధాన సెన్సార్ ED (extra-low dispersion) గ్లాస్ తో తయారు చేయబడింది, దీనిని సాధారణంగా మెరుగైన క్లారిటీ కోసం DSLR లెన్స్‌లలో ఉపయోగిస్తారు. కెమెరా మాడ్యూల్ వ్యూహాత్మక RGB గ్లో, లైటెనింగ్ ఫ్లాష్ లాంటి ఫ్లాష్ మాడ్యూల్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
Poco F3 GT 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,065mAh బ్యాటరీతో వస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే ఫోన్ సగం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. గేమింగ్ సమయంలో మెరుగైన వాయిస్ నాణ్యత కోసం ఇందులో మూడు మైక్రోఫోన్లను పొందు పరిచారు. ఇది Wi-Fi గేమింగ్ యాంటెన్నా, ఖచ్చితమైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, వైబ్రేషన్‌తో కూడిన X-షాకర్స్, GT స్విచ్, మాగ్లెవ్ ట్రిగ్గర్లకు మద్దతు ఇస్తుంది. మొబైల్ ఫోన్ హీట్ అవ్వకుండా వేపర్ ఛాంబర్, ఏరోస్పేస్-గ్రేడ్ వైట్ గ్రాఫేన్ హీట్ సింక్ ఉన్నాయి. ఫోన్ రే ట్రేసింగ్ సామర్థ్యాలను అందించే HyperEngine 3.0కి కూడా మద్దతు ఇస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. భద్రత కోసం Poco F3 GTలో సైడ్-మౌంటెడ్ ఫింగర్పిర్ంట్ సెన్సార్ ఉంది.
Next Story