Thu Nov 21 2024 16:11:05 GMT+0000 (Coordinated Universal Time)
ఆకాశవీధిలో స్వర్గ ద్వారమా
ఇదంతా పక్కన పెడితే.. అప్పుడప్పుడూ ఆకాశంలో కొన్ని వింత ఆకారాలు కనువిందు చేస్తుంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి..
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనాలు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నదులకు వరద ప్రవాహాలు పెరుగుతుండగా.. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. రోడ్లు సైతం చెరువులు, నదులను తలపిస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే.. అప్పుడప్పుడూ ఆకాశంలో కొన్ని వింత ఆకారాలు కనువిందు చేస్తుంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. కొందరు మేఘాల్లో, మేఘాల చాటున కనిపించే ఆ వింత ఆకారాలను ఫొటోలు, వీడియోలు తీసి నెట్టింట షేర్ చేస్తుంటారు. అవి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెంగళూరులో ఆకాశంలో కనిపించిన ఈ వింత ఆకారాన్ని తదేకంగా చూస్తున్నారు. ఇంతకీ ఏంటది అనుకుంటున్నారా ? ఆ వింత ఆకారం ఒక ద్వారంలా కనిపిస్తుంది.
పోనీ మబ్బుల మాటున చంద్రుడి దాక్కుని ఉండటం వల్ల అలా కనిపిస్తుందనడానికి లేదు. ఎందుకంటే పౌర్ణమి ఘడియలకు ఇంకా వారంరోజుల సమయం ఉంది. కొందరు నెటిజన్లు ఆ ఆకారాన్ని చూసి.. ఆకాశవీధిలో స్వర్గధామంలా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఆ ఆకారం స్వర్గద్వారం లాగే కనిపిస్తుంది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Next Story