Tue Nov 05 2024 16:40:26 GMT+0000 (Coordinated Universal Time)
ఆక్టోపస్ ఆకారంలో కనిపించే ఈ గ్రామం ఎక్కడుందో తెలుసా ?
మంచి- మర్యాదలతో పాటు సాంప్రదాయాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. మమకారమే కాదు.. వెటకారం కూడా వీళ్లకి..
ఇంటర్నెట్ లో అప్పుడప్పుడు కొన్ని దృశ్యాలు అబ్బుర పరుస్తాయి. జంతువుల వీడియోలు, కోతులు చేసే ఫన్నీ థింగ్స్, రైళ్లలో కనిపించే దృశ్యాలు.. ఇలా అనేకం ఉంటాయి. కొన్నింటిని చూడగానే.. వావ్ అనిపిస్తుంటుంది. అలాంటి వాటిలో ఈ గ్రామం కూడా ఒకటి. పై నుంచి చూస్తే.. ఆక్టోపస్ ఆకారంలో కనిపించే ఈ ఊరు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. చుట్టూ గోదావరి. నలుదిక్కులా నీరు. మధ్యలో ఊరు. అబ్బా.. ఎంత బాగుందో కదూ. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఊరు ఎక్కడుంది అనే కదూ మీ సందేహం. తెలుసుకుందాం చూడండి.
మంచి- మర్యాదలతో పాటు సాంప్రదాయాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. మమకారమే కాదు.. వెటకారం కూడా వీళ్లకి కాస్త ఎక్కువే. ఆక్టోపస్ ఆకారంలో కనిపించే ఈ గ్రామం పేరు పల్లంకుర్రు లంక. పల్లంకుర్రు ఐలాండ్ అని కూడా అంటారు. ఒకవైపు సముద్రం.. మరోవైపు మడ అడవులు. ఎటు చూసినా నీరు కనిపిస్తుంది. మధ్యలో ఉండేదే గ్రామం. అమలాపురానికి 30 కిలోమీటర్లు, కాకినాడకు 65 కిలోమీటర్ల దూరంలో, కాట్రేనికోన నుండి 9 కి. మీ. దూరంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పల్లంకుర్రు ఐలాండ్ ఉంటుంది. 2011తో పోలిస్తే.. ఇప్పటికి గ్రామం కొంచెం అభివృద్ధి చెందింది.
గ్రామంలో నడిచేందుకు, వాహనాలు తిరిగేందుకు అక్కడక్కడా రోడ్లు వేశారు. కానీ ఇంకా చాలా వరకూ మట్టిరోడ్లు దర్శనమిస్తాయి. ఇక్కడ ప్రజలు నివసించే ఇళ్లు నీటిలోనే దర్శనమిస్తాయి. 2232 హెక్టార్లలో పల్లంకుర్రు ఐలాండ్ విస్తరించి ఉంది. పల్లం నుంచి అమలాపురంకు వెళ్లే దారి.. ఆహా ఏముంది అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఐలాండ్ ఒకటి ఉందని చాలామందికి తెలియదు. యూట్యూబ్ వ్లాగర్స్, ఇన్ స్టా యూజర్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడే ఈ ఐలాండ్ ప్రాచుర్యం పొందుతోంది. తమిళనాడులో ధనుష్కోటికి వెళ్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో.. పల్లం ఐలాండ్ వచ్చేవారికీ అలాంటి అనుభూతి ఉంటుంది.
Next Story