Sun Jan 12 2025 08:33:30 GMT+0000 (Coordinated Universal Time)
శిశువు చేతికి 13 వేళ్లు.. దైవానుగ్రహం అంటున్న కుటుంబం
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో 13 చేతి వేళ్లు, 12 కాలి వేళ్లతో
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో 13 చేతి వేళ్లు, 12 కాలి వేళ్లతో ఒక మగబిడ్డ జన్మించాడు. ఇది దైవానుగ్రహంగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. శిశువు కుడి చేతికి ఆరు వేళ్లు, ఎడమ చేతిలో ఏడు వేళ్లు అలాగే ఒక్కో పాదానికి ఆరు వేళ్లు ఉన్నాయి. శిశువు, అతని తల్లి, 35 ఏళ్ల భారతి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఆరోగ్యంగా ఉన్న బిడ్డ పుట్టిందని భారతి సంబరపడిపోతూ ఉంది. శిశువు తండ్రి గురప్ప కోనూరు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని పాలిడాక్టిలీ అని పిలుస్తారు, ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దీని ఫలితంగా శిశువుల్లో అదనపు చేతి వేళ్లు, కాలి వేళ్లు ఏర్పడతాయి. ఎక్కువ వేళ్ళు లేదా బొటనవేలుతో పుట్టడం వల్ల శిశువుకు దీర్ఘకాలిక సమస్యలు ఉండవని పరిశోధనల్లో తేలింది. పాలీడాక్టిలీ అనేది శిశువుల చేతులు, పాదాలను ప్రభావితం చేసే అత్యంత సాధారణమైన విషయమేనని వైద్యులు చెబుతుంటారు.
Next Story