Mon Dec 23 2024 07:21:56 GMT+0000 (Coordinated Universal Time)
Friend Wife: ఫ్రెండ్ భార్యకు క్యాన్సర్.. డబ్బుల కోసం దొంగతనం
బ్రెస్ట్ క్యాన్సర్ రోగి అయిన తన స్నేహితుడి భార్య చికిత్స కోసం ఈ దొంగతనాలను
బెంగళూరు నగరంలోని ఇటీవల ద్విచక్ర వాహనాలను దొంగిలించి గిరినగర్ పోలీసులకు పట్టుబడిన వ్యక్తి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అతడు సాధారణంగా ఓ చిరు వ్యాపారి. అయితే అతడి స్నేహితుడి భార్య క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంది. డబ్బుల కోసం ఈ దొంగతనాలకు తెగబడ్డాడు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగి అయిన తన స్నేహితుడి భార్య చికిత్స కోసం ఈ దొంగతనాలను చేస్తున్నట్లు వెల్లడించాడు. సోలదేవనహళ్లికి చెందిన నిందితుడు అశోక్ అలియాస్ యాపిల్ (33) తన స్నేహితుడు, అతడి భార్యకు అండగా ఉంటూ వస్తున్నాడు. తన ఫ్రెండ్ భార్యకు క్యాన్సర్ అని తెలియడంతో సహాయం చేయడానికి దొంగగా మారినట్లు పోలీసులు తెలిపారు.
సబ్ఇన్స్పెక్టర్ మంజునాథ్ నేతృత్వంలోని బృందం బ్యాదరహళ్లి నివాసి సతీష్ అలియాస్ సత్య (40)ని కూడా అరెస్టు చేసింది. జులై 26న శక్తి గణపతి దేవాలయం సమీపంలోని గిరినగర్ II ఫేజ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్ కు చెందిన బైక్ (బజాజ్ పల్సర్ 220) చోరీపై దర్యాప్తు చేస్తున్నప్పుడు అశోక్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపాడు. హత్య, దోపిడీ, చైన్ స్నాచింగ్ లు, దొంగతనాలు సహా 42 కేసుల్లో సతీష్ ప్రమేయం ఉండగా, అశోక్ 15 కేసులు ఎదుర్కొని నెల రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. అశోక్ క్రిమినల్ రికార్డును చూసి ఏడాదిన్నర క్రితం అతడి భార్య అతన్ని విడిచిపెట్టింది. అప్పటి నుంచి తన సన్నిహితుడి ఇంట్లోనే ఉంటున్నాడు.
టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలో పనిచేస్తున్న అతని స్నేహితుడి భార్య క్యాన్సర్తో బాధపడుతోంది. ఆమె వైద్యం కోసం వాహనాలను అమ్మి వచ్చిన డబ్బులో ఎక్కువ భాగాన్ని అశోక్ కే ఇచ్చాడు. క్రైమ్ ప్రపంచంలోకి రాకముందు పండ్ల వ్యాపారి కావడంతో అశోక్ను యాపిల్ అని కూడా పిలుస్తారు. తాళం వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ రాత్రి సమయంలో వీరిద్దరూ నేరాలకు పాల్పడ్డారు.. నిందితుల నుంచి రూ.10.7 లక్షల విలువైన ఎనిమిది బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన బైక్లను బ్యాదరహళ్లి సమీపంలోని ఖాళీ స్థలంలో పార్క్ చేసి కొనుగోలుదారుల కోసం వెతుకుతున్నారు.
Next Story