ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పోడగింపు...!!!
కేంద్ర ప్రభుత్వం మరోసారి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకొనే వెసులుబాటు మరోసారి పొడగించింది..!!
కేంద్ర ప్రభుత్వం మరోసారి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకొనే వెసులుబాటు మరోసారి పొడగించింది..!!
యూఐడీఏఐ (UIDAI) నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు 'మై ఆధార్' పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు.
ఆన్లైన్లో సులువుగా ఇలా..
* ఆన్లైన్లో ఆధార్ ఉచిత అప్డేట్ చేయాలంటే ముందుగా యూఐడీఏఐ వెబ్సైట్లో ఆధార్ నంబర్‌తో లాగిన్ కావాలి.
* రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీతో లాగిన్ అయిన వెంటనే అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
* అందులోని వివరాలన్నీ సరైనవో, కాదో చెక్ చేసుకోండి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.
* ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి.
* 14 అంకెల 'అప్డేట్ రిక్వెస్ట్ నంబర్' వస్తుంది. దీనిద్వారా అప్డేట్ స్టేటస్ ఎక్కడివరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
వాస్తవానికి ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ....కానీ కేంద్ర ప్రభుత్వం ఈ తేదీని జూన్ 14,2025 తేదీ వరకు పొడిగించింది..!!
ఈ తేదీ లోపు ఆన్ లైన్ లో ఆధార్ కార్డు ని అప్డేట్ చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు....!!!!
కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ.50 అప్లికేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది..!!
ఈమేరకు ఆధార్ అధికారిక ఎక్స్ లింక్‌లో వివరాలు పోస్ట్ చేసింది.