Wed Dec 25 2024 06:07:43 GMT+0000 (Coordinated Universal Time)
షాకిచ్చిన బంగారం
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1965 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. శుభకార్యాల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే మహిళలకు బిగ్ షాక్ తగిలింది. గత రెండు, మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు అమాతం పెరిగింది. తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లో భారీగా దిగివచ్చిన బంగారం రేటు కాస్త పెరిగింది. పెరిగినా 2 నెలల కనిష్ఠ స్థాయిలోనే ఉందని చెప్పాలి.
హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 పెరిగి, రూ. 60, 650 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి, రూ. 55, 600 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 పెరిగి, రూ. 73, 500 గా నమోదు అయింది.
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1965 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూ.82.525 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.300 పెరిగి రూ.55 వేల 750 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులానికి ఢిల్లీలో రూ.320 పెరిగి ప్రస్తుతం రూ.60 వేల 800 మార్క్ వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండిపై రూ.500 పెరిగింది. ప్రస్తుతం రూ. 73 వేల 500 పలుకుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.300 పెరిగింది. ప్రస్తుతం కిలో రేటు రూ. 78 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది.
Next Story