Mon Dec 23 2024 04:53:37 GMT+0000 (Coordinated Universal Time)
రైలు చివరి బోగి వెనుక ఆంగ్ల అక్షరం X ఎందుకు రాసి ఉంటుందంటే..
మీరెప్పుడైనా రైలు ఎక్కారా? అదేం ప్రశ్న, రైలు ఎక్కని వారు ఎవరైనా ఉంటారా? అని అడగబోతున్నారా? అయితే ..
మీరెప్పుడైనా రైలు ఎక్కారా? అదేం ప్రశ్న, రైలు ఎక్కని వారు ఎవరైనా ఉంటారా? అని అడగబోతున్నారా? అయితే అసలు విషయం మాత్రం అది కాదండి. ఎందుకంటే ఆ ప్రశ్నకు ఇంకా కొనసాగింపు ఉంది. అదేమిటంటే రైలు ఎక్కడానికి స్టేషన్కు వెళ్లినప్పుడు రైలు బోగీలను జాగ్రత్తగా గమనించారా..? ప్రధానంగా రైలు చివరి పెట్టె వెనుక భాగాన్ని పరిశీలించారా? పరిశీలించాం, చూశాం, అయితే ఏమిటి అంటారా? ఆ, అయితే అక్కడే ఆగండి. రైలు చివరి పెట్టె వెనుక భాగంలో ఆంగ్ల అక్షరం X అని పెద్దగా రాసి ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా చూశారా? దాని గురించే మేం చెప్పబోయేది. అసలు అలా X అని ఎందుకు రాసి ఉంటుందో మీకు తెలుసా? అయితే ఎందుకో తెలుసుకోండి!
రైలు బోగీల్లో చివరి బోగీ వెనుక X అని రాసి ఉంటే ఆ రైలుకు ఆ పెట్టే చివరిది అని అర్థం. అంతేకాదు ఆ X అక్షరం కిందే ఓ ఎర్రని లైటు, దాని పక్కనే LV అనే ఓ బోర్డు కూడా తగిలించబడి ఉంటుంది ఇది మీరు గమనించవచ్చు. ఇవన్నీ X అక్షరం లాగే ఉపయోగపడతాయన్నట్లు. వీటి వల్ల రైలుకు ఉన్న ఆ పెట్టెను చివరి పెట్టెగా పరిగణిస్తారు. అయితే X అక్షరం పగటి సమయంలో మాత్రమే కనిపిస్తుంది కదా.. మరి రాత్రి కనిపించదు.. ఆ రైలు బోగి చివరిదని ఎలా గుర్తు పడతారనే అనుమానం మీకు రావచ్చు. దానికి కూడా సమాధానం ఉందండోయ్. రాత్రి X అనే అక్షరం కనబడదు కాబట్టి ఇందకే చెప్పుకున్నట్లు దాని పక్కనే ఎర్రని లైటు రాత్రి పూట ఉపయోగపడుతుంది.
దీని వల్ల వాటిని చూసే వారు ఆ రైలు అన్ని పెట్టెలతోనే వెళ్తుందని అర్థం చేసుకుంటారు. ఆ రెడ్ లైటు కనిపించకపోతే బోగీ తప్పపోయిందని గుర్తుపడతారు రైల్వే అధికారులు. ఒక వేళ రైలు చివరి పెట్టెకు ఈ అక్షరాలు ఏవీ లేకపోతే అది ప్రమాదవశాత్తూ కొన్ని బోగీలు లేకుండానే నడుస్తుందని తెలుసుకుంటారు. దీంతో వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. సో, రైలు చివరి పెట్టె వెనుక ఉన్న అక్షరాల మతలబు అదన్నమాట.
Next Story