నిధుల మళ్లింపు వ్యవహారం..హీరో మోటో కార్ప్పై విచారణ
ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్పై భారత కొర్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.
ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్పై భారత కొర్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. థర్డ్ పార్టీ అమ్మకందారుతో కలిసి ఈ సంస్థ అనధికారికంగా నిధుల మళ్లింపుకు పాల్పడిరదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా హీరో మోటోకార్ప్ యాజమాన్య నిర్మాణం (స్ట్రక్చర్ ) గురించి వివరాలు తెలుసుకోడానికి, మూడో పార్టీ అమ్మకందారుని ప్రభావితం చేస్తోందేమో అనే విషయం బహిర్గతం చేయడానికి ఈ విచారణను ఆదేశించినట్లు కేంద్రప్రభుత్వంలోకి కీలకమైన వ్యక్తి ఒకరు రాయిటర్కి వెల్లడిరచారు.
‘హీరో’ భారతదేశంలో అత్యంత ఎక్కువగా మోటార్ సైకిళ్లను తయారు చేసే కంపెనీ. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 56,000 కోట్ల రూపాయలు. ఆ కంపెనీ ఒక్కో షేరు ధర 2865 రూపాయలు. గురువారం 105 రూపాయల నష్టంతో ట్రేడ్ అయింది. ‘విచారణ విషయమై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, అందుకే ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేమని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఏ నియంత్రణ మండలి, ఎలాంటి సమాచారం అడిగినా, మేము పూర్తిగా అందిస్తాము, వారికి పూర్తిగా సహకరిస్తాము.’ అని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి తెలిపారు. ఈ వార్త కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది.