Sun Dec 22 2024 19:10:39 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాణాలొదిన పోర్న్ స్టార్.. పంచనామాలో తేలింది ఏమిటంటే?
అడల్ట్ ఫిల్మ్ స్టార్ జెస్సీ జేన్ 2024 జనవరిలో చనిపోయింది
అడల్ట్ ఫిల్మ్ స్టార్ జెస్సీ జేన్ 2024 జనవరిలో చనిపోయింది. ఆమె మరణానికి సంబంధించిన మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆమె మత్తు పదార్థాలను మోతాదుకు మించి తీసుకోవడంతోనే ప్రాణాలు వదిలిందని ఏలింది. ఫెంటానిల్, కొకైన్ ప్రమాదవశాత్తూ అధిక మోతాదులో తీసుకోవడంతో ఆమె మరణించినట్లు శవపరీక్ష నివేదిక ధృవీకరించింది.
ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. 43 ఏళ్ల జెస్సీ జేన్ అసలు పేరు సిండి టేలర్ అలియాస్ సింథియా ఆన్ హోవెల్. జనవరి 24, 2024న ఓక్లహోమాలోని తన ప్రియుడి ఇంటిలో శవమై కనిపించింది. ఆమె ప్రియుడు బ్రెట్ హాసెన్ముల్లర్ కూడా సంఘటన స్థలంలోనే చనిపోయాడు. ఓక్లహోమా మెడికల్ ఎగ్జామినర్స్ ఆఫీస్ శవపరీక్షను నిర్వహించింది. ఫెంటానిల్, కొకైన్ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడమే మరణానికి కారణమని వెల్లడించింది.
జెస్సీ జేన్ అడల్ట్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ప్రముఖ నటి. 100కి పైగా అడల్ట్ ఫిల్మ్లలో నటించింది. అనేక అవార్డులు, నామినేషన్లను దక్కించుకుంది. ఆమె 2002లో తన పోర్న్ కెరీర్ని ప్రారంభించింది. డిజిటల్ ప్లేగ్రౌండ్ స్టూడియోతో ప్రత్యేక ఒప్పందంపై 2014 వరకు కొనసాగింది. 2017లో పరిశ్రమ నుండి రిటైర్మెంట్ను ప్రకటించింది.
Next Story