Thu Dec 26 2024 22:56:11 GMT+0000 (Coordinated Universal Time)
ఏడాది కాలంలో నేడు లాంగెస్ట్ డే.. ఎందుకో తెలుసా ?
జూన్ 21న ఉదయం 5:34 గంటలకు సూర్యోదయం జరిగితే.. సాయంత్రం 6:41 గంటలకు సూర్యుడు అస్తమిస్తాడు. దక్షణాది అర్థగోళంలో ఉండే
ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పగటి రోజు జూన్ 21. బుధవారం నాడు పగలు సమయం ఎక్కువ ఉండగా, రాత్రి తక్కువగా ఉంటుంది. దాంతో అతిపెద్ద పగటి సమయం ఉండే రోజుగా జూన్ 21 అని చెబుతారు. సాధారణ రోజుల్లో పగటి సమయం 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే జూన్ 21వ తేదీన పగలు కనీసం 13 గంటల 7 నిమిషాల ఉంటుంది. జూన్ 22న సైతం అతిపెద్ద పగటి పూట వచ్చే అవకాశం ఉంది. గతంలో 1975 జరగగా, మళ్లీ 2203 సంవత్సరంలో జూన్ 22న అతిపెద్ద పగటి పూట ఉండే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. జూన్ 21న సూర్యుడు ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖకి లంబంగా వస్తాడు. సాధారణంగా భారత్ లో తొలి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. దోంగ్ గ్రామంలో దేశంలో సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు. జూన్ 21న మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరిగింది. ఇక డిసెంబర్ 22వ తేదీన లాంగెస్ట్ నైట్ డే ఏర్పడుతుంది.
జూన్ 21న ఉదయం 5:34 గంటలకు సూర్యోదయం జరిగితే.. సాయంత్రం 6:41 గంటలకు సూర్యుడు అస్తమిస్తాడు. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్లో శీతాకాలం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 21న పగలు, రాత్రి వ్యవధి సమానంగా ఉంటాయి. డిసెంబర్ 22న అదిపెద్ద రాత్రి సమయం ఉంటుంది. మరో స్పెషల్ డే అయిన మార్చి 21 రోజు సూర్యుడు భూమధ్యరేఖకు ఎగువన ఉంటాడు, ఆరోజు పగలు, రాత్రి వ్యవధి సమానంగా ఉంటాయి. ఇక పలు దేశాల్లో ఈరోజును ప్రత్యేకంగా భావించి సెలెబ్రేట్ చేసుకుంటారు.
Next Story