Mon Dec 23 2024 04:50:33 GMT+0000 (Coordinated Universal Time)
Thief: ఇంట్లోకి దొంగ వచ్చాడు.. 20 రూపాయలు పెట్టేసి వెళ్ళాడు!
దొంగతనానికి వచ్చిన ఓ దొంగకు ఇంట్లో ఏమీ దొరకకపోవడంతో
దొంగతనానికి వచ్చిన ఓ దొంగకు ఇంట్లో ఏమీ దొరకకపోవడంతో 20 రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి ఎలాగోలా వెళ్లిన దొంగకు ఒక్క రూపాయి కూడా దొరక్కపోవడంతో.. ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకుని దాని డబ్బులంటూ రూ. 20 టేబుల్పై పెట్టి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు ఎవరో వచ్చి వెళ్లారనే అనుమానం కలగగా.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అప్పుడు దొంగ ఇంట్లో తచ్చాడడం గమనించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాస్క్ వేసుకుని వచ్చిన దొంగ తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అతడికి ఒక్క రూపాయి కూడా కనిపించలేదు. దొంగ ఇంట్లోని సీసీ టీవీ కెమెరా వద్దకు వచ్చి ఒక్క రూపాయి కూడా దొరకలేదని సైగ చేశాడు. ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లి ఓ నీళ్ల బాటిల్ తీసుకున్నాడు. వెనక్కి వచ్చి జేబులోంచి పర్సు తీసి అందులోంచి రూ. 20 తీసి ఆ నోటును టేబుల్పై ఉంచాడు.
Next Story