Mon Dec 23 2024 06:59:49 GMT+0000 (Coordinated Universal Time)
వేణుస్వామి వివరణ విన్నారా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పకుండా గెలుస్తారని చెప్పిన వారిలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా ఉన్నారు. ఆయన వీడియోను సోషల్ మీడియాలో పలువురు హైలైట్ చేశారు. అయితే ఇప్పుడు తన లెక్క తప్పిందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
దేశంలో ప్రధాని మోదీ ప్రభావం తగ్గుతుందని తాను చెప్పానని... అది నిజమైందని, కానీ ఏపీలో మాత్రం జగన్ విజయం సాధిస్తారని చెప్పానని అందులో తన అంచనాలు తప్పాయన్నారు.తాను చెప్పిన రెండింట్లో ఒకటి నిజమైందని మరొకటి లెక్క తప్పిందన్నారు. తనకున్న పరిజ్ఞానం, విద్యను అనుసరించి వెల్లడించానన్నారు. పోటీ చేసిన వారి జాతకాన్ని ఆధారంగా చేసుకొని తాను ఫలితాలను చెప్పానని.. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ విషయంలో తాను చెప్పింది వంద శాతం తప్పని అంగీకరిస్తున్నానని అన్నారు.
Next Story