Sun Dec 22 2024 16:18:52 GMT+0000 (Coordinated Universal Time)
Mother's Love: తల్లి ప్రేమను చాటి చెప్పే ఎలుక సాహసం.. వీడియో వైరల్!!
తల్లి తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా ప్రాంతాల్లో నీరు వచ్చి చేరుకుంటూ ఉంటుంది. అలా ఎలుకలు పెట్టుకున్న బొరియలు కూడా నీటిలో మునిగిపోతూ ఉంటాయి. అయితే ఓ ఎలుక చేసిన సాహసానికి సంబంధించిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా ఆన్ లైన్ లో ఉన్న ఈ వీడియోను మరోసారి నెటిజన్లు షేర్ చేస్తూ వస్తున్నారు. తల్లి ప్రేమ గురించి చర్చిస్తూ ఉన్నారు.
తల్లి తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది/ ఏ పని చేయడానికైనా సిద్ధమవుతుంది. తమ బిడ్డకు ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు తల్లులు తమ గురించి అసలు ఆలోచించరు. ఇది జంతువులకు కూడా వర్తిస్తుందనే వీడియో ఇది. వర్షం పడుతూ నీళ్లు నిండిపోతూ ఉన్నా కూడా ఆ తల్లి ఎలుక బొరియలోకి దూరిపోయి మరీ తన పిల్లలను బయటకు తీసుకుని వచ్చింది. ఏదో సస్పెన్స్ సినిమాను తలపించేలా ఈ వీడియో ఉంది. వర్షం కారణంగా ఆ బొరియ నీటి లో మునిగిపోతున్నా ఆ తల్లి ఎలుక చేసిన సాహసాన్ని అసలు మరచిపోరు ఎవ్వరూ. 2020లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. 2 నిమిషాల 20 సెకన్ల వీడియోలో, ఒక తల్లి ఎలుక తన పిల్లలను వాటి గూడులో మునిగిపోకుండా కాపాడుతోంది. తన పిల్లలు నీటిలో మునిగిపోయి చనిపోకుండా కాపాడటానికి, తల్లి ఎలుక నీటిలో మునిగిన గూడులోకి ప్రవేశించి, తన పిల్లలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకుని రావడానికి ఒక్కొక్కటిగా బయటకు తీయడం కనిపిస్తుంది.
Next Story