Mon Dec 23 2024 18:39:14 GMT+0000 (Coordinated Universal Time)
Winter Solstice: నేడే శీతాకాలపు అయనాంతం.. అంటే ఏమిటో తెలుసా?
నేడు భారతదేశంలో సుదీర్ఘమైన రాత్రి, అతి తక్కువ పగటిపూట
నేడు భారతదేశంలో సుదీర్ఘమైన రాత్రి, అతి తక్కువ పగటిపూట ఉండనుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 21 లేదా డిసెంబరు 22న ఈ కాల పరివర్తన జరుగుతుంది. ఈ దృగ్విషయాన్నే ‘శీతాకాలపు అయనాంతం’ అని పిలుస్తారు. భూమి ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా వంగినప్పుడు ‘శీతాకాలపు అయనాంతం’ ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి తన అక్షం మీద 23.4 డిగ్రీలు వంగుతుంది. ఈ కారణంగా భూమి ధ్రువం పగటిపూట సూర్యుడికి దూరంగా ఉంటుంది. అందుకే అతి తక్కువ పగలు ఉండనుంది. దీంతో సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. ఈ మార్పు కారణంగానే డిసెంబర్ 22 శుక్రవారం భారత కాలమానం ప్రకారం ఉదయం 8.57 గంటలకు శీతాకాలపు అయనాంతం సంభవించింది. ఫలితంగా ఉత్తరార్థ గోళంలో అతి తక్కువ పగటిపూట సంభవిస్తుంది. 7 గంటల 14 నిమిషాలు మాత్రమే పగటిపూట వెలుతురు ఉంటుంది.
ఈ రోజున, పగలు తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది, ఈ రోజున పగలు ముందుగానే ముగుస్తుంది. రాత్రి 13 గంటల 38 నిమిషాల పాటు ఉంటుంది. ఈ రోజు సూర్యోదయం తరువాత, సాయంత్రం సూర్యాస్తమయం ఇతర రోజుల కంటే ముందుగానే ఉంటుంది. సూర్యకాంతి ఈరోజు భూమిపై కేవలం 10 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ రోజు రాత్రి సంవత్సరంలోనే అతి పెద్దది కానుంది. ఈరోజు ఉత్తర ధృవానికి స్వల్ప సూర్యకాంతి మాత్రమే తాకుతుంది. ఫలితంగా రాత్రి ఎక్కువ సేపు ఉంటుంది. ఈ ఏడాది జూన్ 21న ఇదే తరహాలో లాంగెస్ట్ డే నమోదైంది.
Next Story