Mon Dec 23 2024 02:52:04 GMT+0000 (Coordinated Universal Time)
Amazon Order: అమెజాన్ లో ఆర్డర్ పెట్టింది.. ఏమొచ్చిందంటే?
ఆన్ లైన్ లో ఆర్డర్లు పెట్టడం ప్రతి ఒక్కరికీ అలవాటే..
ఆన్ లైన్ లో ఆర్డర్లు పెట్టడం ప్రతి ఒక్కరికీ అలవాటే.. అయితే కొన్ని కొన్నిసార్లు మనం పెట్టిన ఆర్డర్ కాకుండా వేరే వేరే వస్తువులు డెలివరీ చేయబడుతూ ఉంటాయి. కొలంబియాకు చెందిన ఓ మహిళ అమెజాన్ లో తాను పెట్టిన ఆర్డర్ స్థానంలో తొండ రావడంతో ఒక్కసారిగా షాక్ అయింది. ఆ మహిళ అమెజాన్ నుండి ఎయిర్ ఫ్రైయర్ కోసం ఆర్డర్ చేసింది. కానీ బదులుగా ఆమె తన ప్యాకేజీలో తొండ రావడం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె పెట్టిన పోస్టుకు కొన్ని మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. సోఫియా సెరానో తన అమెజాన్ ప్యాకేజీలో కనిపించిన తొండ చిత్రాన్ని షేర్ చేసింది.
“మేము అమెజాన్ ద్వారా ఎయిర్ ఫ్రైయర్‌ని ఆర్డర్ చేసాము. అందులో ఓ తొండ వచ్చింది. ఇది Amazon లోపమో లేక క్యారియర్ తప్పిదమో నాకు తెలియదు... శుభోదయం,” అంటూ స్పానిష్ లో ఆమె తెలిపింది. చాలా మంది వినియోగదారులు.. కామెంట్ల విభాగంలో, సెరానో తన ప్రాంతంలో ఉన్న పర్యావరణ సంస్థని సంప్రదించాలని సూచించారు. సరీసృపాల సంరక్షణను చూసే పర్యావరణ సంస్థలను సంప్రదించమని ఒక వినియోగదారు చెప్పారు. మార్కా అనే స్పానిష్ వార్తాపత్రికతో మాట్లాడిన సెరానో.. తాను ఆర్డర్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ స్థానంలో భారీ తొండని చూసి భయపడిపోయానని చెప్పింది. నివేదిక ప్రకారం, ప్యాకేజీలో కనిపించినది 'స్పానిష్ రాక్ లిజార్డ్'. సోఫియా సెరానో వైరల్ పోస్ట్‌పై అమెజాన్ ఇంకా స్పందించలేదు
Next Story