Sun Dec 22 2024 09:11:10 GMT+0000 (Coordinated Universal Time)
చాకొలేట్ ప్యాకెట్ లో నుండి బయటపడ్డ పళ్ల సెట్
రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఓ చాక్లెట్ ప్యాకెట్ ను తెరచి చూడగా.. పళ్ల సెట్
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఓ చాక్లెట్ ప్యాకెట్ ను తెరచి చూడగా.. పళ్ల సెట్ కనిపించడంతో షాక్ అయింది. ఆమె ఒక ప్రభుత్వేతర సంస్థలో వాలంటీర్‌గా పని చేస్తున్నారు. అక్కడ ఆమె పిల్లల పుట్టినరోజున ఓ చాక్లెట్‌ను అందుకున్నారు.
మాయాదేవి గుప్తా మాట్లాడుతూ.. చాక్లెట్ అందుకున్న కొన్ని రోజుల తర్వాత తినాలని అనుకుని ఓపెన్ చేస్తే దంతాల సెట్‌ను కనుగొని షాక్ అయ్యానని తెలిపింది. ఓ పాపులర్ బ్రాండ్‌కి చెందిన కాఫీ ఫ్లేవర్ చాక్లెట్ ఇచ్చారు.. ఆ చాక్లెట్ తిన్న తర్వాత ఏదో కరకరలాడే చాక్లెట్ ముక్కలా అనిపించింది. కానీ, మరోసారి నమలాలని ప్రయత్నించినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అదెంటోనని చూడగా.. నాలుగు దంతాల సెట్ కనిపించడంతో ఆశ్చర్యపోయానని అన్నారు.
NGOలో ఆమె పాఠాలు బోధిస్తూ ఉంటారు. ఇతర సామాజిక కార్యకర్తల సమక్షంలో పిల్లల పుట్టినరోజులు తరచుగా జరుపుకుంటారు. అలాంటి సందర్భంలో ఒక విద్యార్థి నుంచి మాయాదేవి చాక్లెట్ అందుకున్నారు. ఈ విషయమై ఆమె ఖర్గోన్‌లోని జిల్లా ఆహార, ఔషధ శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు బృందాన్ని పంపినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి హెచ్ఎల్ అవాసియా తెలిపారు. చాక్లెట్లు కొనుగోలు చేసిన దుకాణం నుండి శాంపుల్స్ ను సేకరించారు.
Next Story