అలా ఎలా రాజా?
నాగ శౌర్య కి రెండు మూడు డిజాస్టర్స్ పడేసరికి.. మళ్లీ తన ఓన్ బ్యానేర్ లోనే కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నాడు. [more]
నాగ శౌర్య కి రెండు మూడు డిజాస్టర్స్ పడేసరికి.. మళ్లీ తన ఓన్ బ్యానేర్ లోనే కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నాడు. [more]
నాగ శౌర్య కి రెండు మూడు డిజాస్టర్స్ పడేసరికి.. మళ్లీ తన ఓన్ బ్యానేర్ లోనే కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నాడు. సమంత తో కలిసి ఓ బేబీ సినిమాలో నటించిన తను… ఆ సినిమాలో హీరోగా కాకుండా ఓ కీలక పాత్రలో నటించాడు. ఓ బేబీ సినిమా జులై 5 న విడుదల కాబోతుంది. అయితే రమణ తేజ దర్శకత్వంలో మెహ్రీన్ కౌర్ తో జోడి కడుతున్న నాగ శౌర్య షూటింగ్ లో తీవ్ర గాయాల పాలయ్యాడట. ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటుండగా.. కాలికి గాయమైనట్లుగా తెలుస్తుంది.
ఆ యాక్షన్ సీక్వెన్సెస్ లో కాలికి తీవ్ర గాయమవడంతో డాక్టర్స్ చికిత్స చేసి కట్టు కట్టి.. దాదాపుగా నాలుగు వారాల పాటు బెస్ట్ రెస్ట్ లో ఉండాలని సూచించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వైజాగ్ షెడ్యూల్ లో షూటింగ్ ని చిత్రీకరిస్తున్న చిత్ర బృందం హీరో కాలికి గాయమవడంతో ఇక షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసినట్లుగా తెలుస్తుంది. తనకి గాయమై వీల్ చైర్ లో కూర్చున్న ఫొటోస్ ఇపుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. తీవ్ర గాయాలతో నాగ శౌర్య అంటూ సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ హల్చల్ చేస్తుంది.