Wed Dec 25 2024 05:58:14 GMT+0000 (Coordinated Universal Time)
ఇక్కడ క్రేజ్ తగ్గుతోన్న టైం లో అక్కడ నెగ్గుతుందా?
టాలీవుడ్ లో అజ్ఞాతవాసి దెబ్బకి క్రేజ్ మొత్తం పోగొట్టుకున్న కీర్తి సురేష్… మహానటితో మాత్రం పిచ్చ క్రేజ్ సంపాదించింది. ఒకే ఒక్క సినిమాతో తెలుగు తమిళంలోనూ కీర్తి [more]
టాలీవుడ్ లో అజ్ఞాతవాసి దెబ్బకి క్రేజ్ మొత్తం పోగొట్టుకున్న కీర్తి సురేష్… మహానటితో మాత్రం పిచ్చ క్రేజ్ సంపాదించింది. ఒకే ఒక్క సినిమాతో తెలుగు తమిళంలోనూ కీర్తి [more]
టాలీవుడ్ లో అజ్ఞాతవాసి దెబ్బకి క్రేజ్ మొత్తం పోగొట్టుకున్న కీర్తి సురేష్… మహానటితో మాత్రం పిచ్చ క్రేజ్ సంపాదించింది. ఒకే ఒక్క సినిమాతో తెలుగు తమిళంలోనూ కీర్తి సురేష్ హావ పెరిగిపోయింది. కానీ మహానటితో ఎక్కడికో వెళుతుంది అనుకుంటే… ఇప్పుడు తెలుగులో అవకాశాలు లేకుండా ఖాళీ అయ్యింది. ఇక తమిళంలో మహానటి ముందే.. స్వామి స్క్వేర్, పందెం కోడి, సర్కార్ సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవీ ఆడకపోవడం, ఆ సినిమాల్లో కీర్తి సురేష్ ప్రాధాన్యత లేని పాత్రలు చెయ్యడమో.. కీర్తి సురేష్ క్రేజ్ డౌన్ అవుతూ వచ్చింది. ఇక తెలుగులో సరేసరి. తాజాగా రజినీకాంత్ – మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. మొదట హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుంది.
ఇక తాజాగా కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుందనే న్యూస్ టాలీవుడ్మ్ కోలీవుడ్ మీడియాస్ లో వినబడుతుంది. బాలీవుడ్ లో అమిత్ శర్మ దర్శకత్వంలో (లేట్) శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మించబోయే ఒక లేడి ఓరియెంటెడ్ మూవీ లో నటించబోతుందని న్యూస్ వైరల్ అయ్యింది. అమిత్ శర్మ గతంలో బధాయి హో అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు కూడా మంచి డిఫ్రెంట్ కథతో మరో కథని సిద్ధం చేసాడట. ఇక ఆ కథ నచ్చిన కీర్తి సురేష్ అమిత్ శర్మ – బోణి కపూర్ కంబోకి ఓకె చెప్పేసిందని టాక్. అమిత్ శర్మ చెప్పిన కథలో తన పాత్ర ఛాలెంజింగ్ లా కనబడ్డంతో కీర్తి ఈ బాలీవుడ్ ఆఫర్ ని ఓకె చేసిందంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.
Next Story