ఈ అమ్మడి పొగరింగుల పోజులు కరక్టేనా?
సినిమా తారలు అందరూ వారి వ్యక్తిగత జీవితాలలో ఎటువంటి అలవాట్లు, వ్యసనాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ తెరపై కానీ బహిరంగ ప్రదేశాలు వేదికలపై కానీ ధూమపానానికి దూరంగా ఉండమనే సందేశాన్నే ప్రేక్షకులకు పంచుతారు. అయితే అది పాటించే వారెందరు అంటూ విశ్లేషణలు విమర్శలు అప్రస్తుతం. ఇక అసలు విషయానికి వస్తే జాకీ ష్రాఫ్ ముద్దుల తనయురాలు కృష్ణ ష్రాఫ్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాద్యమాలలో హద్దులు లేని అందాల ఆరబోతల ఆల్బమ్‌లు పలు మార్లు అప్లోడ్ చేసి తన ఫాలోయర్స్ ని ఉత్తేజపరిచింది. ఇక ఈ సారి ఎప్పటిలానే కేవలం అందాలు మాత్రమే ప్రదర్శిస్తే ఫాలోయర్స్ బోర్ ఫీల్ అవుతారు అనుకుందో ఏమో కానీ ప్రస్తుతం హల్చల్ చేస్తున్న తన ఫోటో ఆల్బమ్ కోసం పెద్ద సాహసానికి ఒడికట్టింది కృష్ణ ష్రాఫ్.
సోషల్ మీడియా లో ఘాటైన చర్చకు దారి తీసిన కృష్ణ ష్రాఫ్ తాజా ఆల్బంలో అందాల ప్రదర్శనలతో పాటు గుప్పు గుప్పు మంటూ పొగాకు పొగను రింగు రింగులుగా వదిలి తిప్పుతూ ఫొటోలకి ఫోజులిచ్చింది. ఈ ఆల్బమ్ కు తన ఫాలోయర్స్ నుంచి భారీ గా లైక్ లతో స్పందన వస్తుండగా, మరో పక్క అదే సోషల్ మీడియాలో జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖ నటుడి వారసురాలు ఐయి ఉండి ఇలాంటి ఫొటోలతో జనానికి తప్పుడు సంకేతాలు పంపకూడదు అన్న భాధ్యతను మరిచి ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం తాపత్రయ పడుతుంది అని కృష్ణ ష్రాఫ్ పై దుమ్మెత్తిపోస్తున్న వారు కూడా అదే సంఖ్యలో ఉండటం గమనార్హం.
- Tags
- krishna shraf