ఎఫ్ 2 నాకు నచ్ఛలేదు అంటున్న హీరో?
గత ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ బడ్జెట్ సినిమాలకు చుక్కలు చూపించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్ 2 సినిమా చూసిన ఓ హీరోకి ఆ [more]
గత ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ బడ్జెట్ సినిమాలకు చుక్కలు చూపించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్ 2 సినిమా చూసిన ఓ హీరోకి ఆ [more]
గత ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ బడ్జెట్ సినిమాలకు చుక్కలు చూపించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్ 2 సినిమా చూసిన ఓ హీరోకి ఆ సినిమా నచ్చలేదట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ – వరుణ్ తేజ్ కలయికలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా ఫస్ట్ హాఫ్ హిలేరియస్ కామెడీ తో అదరగొట్టగా… సెకండ్ హాఫ్ సో సో కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ… ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈసినిమా చాలామందికి నచ్చనప్పటికీ… ఆ సినిమా నిజంగానే కలెక్షన్స్ వర్షం కురిపించింది. అయితే తాజాగా ఓ యువ నటుడు ఎఫ్ 2 మొదటి 15 నిముషాలు చూసి చిరాకేసి బయటికొచ్చేశా అంటున్నాడు.
ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమా దాస్, హిట్ సినిమాల్తో హీరోగా మారిన విశ్వక్ సేన్.. తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ నీకుమాత్రమే చెబుతా షోకి గెస్ట్ గా వచ్చాడు. ఆ షోలో అసలు తానెలా హీరో అయ్యాడు. సినిమాలోకి ఎలా వచ్చాడో కారణాలతో పాటుగా.. తన పర్సనల్ విషయాలను పంచుకున్నాడు. అలాగే నీకు నచ్చని సినిమా ఏది అని భాస్కర్ అడగగా.. దానికి నన్ను నలుగురు ప్రొడ్యూసర్స్ దగ్గర నాలుగు డైరెక్టర్స్ దగ్గర ఇరికిద్దామనుకున్నావా అంటూనే… కామెడి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే సంభాషణలతో పుడుతుంది కానీ… కామెడీ చేసే వారే ఎగిరెగిరి కామెడీ చేస్తే అది చెత్తగా ఉంటుంది. ఎఫ్ 2 సినిమా చూద్దామని థియేటర్ కి వెళ్లిన నేను మొదటి 15 నిమిషాలకే బుర్ర హీటెక్కి బయటికొచ్చేసా…. కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి.. భారీ కలెక్షన్స్ సాధించింది. నాకు నచ్చనంత మాత్రాన ఆ సినిమా అందరికి నచ్చక్కర్లేదని రూల్ లేదు.. కాకపోతే ఆ సినిమా నాకు కనెక్ట్ కాలేదంటున్నాడు.