కార్తికేయ వల్ల ఒరిగేదేమి లేదుగా
RX 100 సినిమాతో ఒక కొత్తబ్బాయి.. సడన్ గా హీరో అయ్యాడు. అజయ్ భూపతి దర్శకుడిగా తెరకెక్కిన RX 100 లో కార్తికేయ హీరోగా నటించి మార్కులు [more]
RX 100 సినిమాతో ఒక కొత్తబ్బాయి.. సడన్ గా హీరో అయ్యాడు. అజయ్ భూపతి దర్శకుడిగా తెరకెక్కిన RX 100 లో కార్తికేయ హీరోగా నటించి మార్కులు [more]
RX 100 సినిమాతో ఒక కొత్తబ్బాయి.. సడన్ గా హీరో అయ్యాడు. అజయ్ భూపతి దర్శకుడిగా తెరకెక్కిన RX 100 లో కార్తికేయ హీరోగా నటించి మార్కులు కొట్టెయ్యడమే కాదు.. కార్తికేయ రెండో సినిమా మీద భారీ క్రేజ్ వచ్చేలా చేసాడు. అయితే RX 100 తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన హిప్పీ సినిమా లో కార్తికేయపై సరిగ్గా నటించడం కాదు, అసలు ఎలాటి హావ భావాలూ లేకుండా చొక్కా విప్పి 6 ప్యాక్ చూపిస్తూ మ్యానేజ్ చేసాడు. ఆ సినిమాలో హిప్పీగా కార్తికేయ కు ఎలాంటి పేరు రాలేదు. కేవలం అతని బాడీ తో గజిబిజి చేసాడంతే.
అయితే కార్తికేయ క్రేజ్ తో అతన్ని విలన్ గా తమ సినిమాలో తీసుకుంటే బావుంటుందని.. భావించిన హీరో నాని – దర్శకుడు విక్రమ్ కుమార్లు తమ సినిమా గ్యాంగ్ లీడర్ లోకి కార్తికేయ ని విలన్ గా తీసుకున్నారు. కార్తికేయ RX 100 హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి టైం లో కార్తికేయ తమ సినిమాలో నటిస్తే తమ సినిమాకి క్రేజ్ పెరుగుతుందని నాని – విక్రమ్ కుమార్ లు అనుకున్నారు. కానీ ఇప్పుడు హిప్పీ సినిమా చూసాక నాని, విక్రమ్ కుమార్ లు కంగారు పడుతున్నారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఏదో రెండు మూడు ప్లాప్స్ ఉన్న హీరో ని తమ సినిమాలో విలన్ గా తీసుకుంటే బావుండేది అనవసరంగా కార్తికేయకి కమిట్ అయ్యాము అని అనుకుంటున్నారని టాక్ వినబడుతుంది