కొనసాగుతున్న కథానాయికల విడాకుల పరంపర
రంభ, అమల పాల్, మలైకా అరోరా ఖాన్, ఏంజలీనా జోలీ, సానియా అగర్వాల్ ఇలా చెప్పుకుంటూ పోతే వెండి తెరపై కథానాయికలు గా ఎదిగి అగ్ర స్థానం కోసం పోటీ పడిన అనేక మంది వారి వైవాహిక జీవితాల్లో మాత్రం గెలవలేక విడిపోతున్న వారే. ఇప్పుడు ఈ జాబితాలోకి మీరా జాస్మిన్ కూడా చేరిపోవటం విచారకరం. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా పని చేసినా మీరా జాస్మిన్ కి అవకాశాలు వెల్లువెత్తకపోవటంతో తమిళ, మళయాళ భాషల్లో ఎక్కువ చిత్రాలు చేసి బాగా పాపులర్ ఐయింది. మలయాళ చిత్రాలతో కెరీర్ ఫుల్ స్విన్గ్లో ఉండగానే మాండలిన్ రాజేష్ అనే సంగీత విద్వాంసుడితో ప్రేమాయణం నడిపి వివాహం వరకు వెళ్లకుండానే విడిపోయింది మీరా జాస్మిన్.
తరువాతి కాలంలో అనిల్ జాన్ టైటస్ అనే పారిశ్రామిక వేత్త ని వివాహమాడింది మీరా జాస్మిన్. అతనికి అప్పటికే వివాహమై విడాకులు పొందటంతో మీరా జాస్మిన్ ని రెండవ వివాహం చేసుకున్నాడు అనిల్. అప్పట్లో అనిల్ మొదటి భార్య తరపున బంధువుల నుంచి దాడులు, ప్రాణ హాని ఉన్నాయని పోలీస్ శాఖ వారి రక్షణ కోరుతూ అర్జీ కూడా పెట్టుకుంది మీరా జాస్మిన్. అంత ముచ్చటపడి అనిల్ ని పెళ్లి చేసుకున్న మీరా జాస్మిన్ ఏడాదికే అతనితో మనస్పర్థలు రావటంతో ఇప్పుడు విడిగా ఉంటుంది అంట. ఇద్దరి మధ్య ఇక సఖ్యత పొసగదు అని నిర్ధారించుకుని ఇప్పుడు విడాకుల మంజూరు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది మీరా జాస్మిన్. మరో వైపు తిరిగి తన సినీ జీవితం ప్రారంభించటానికి పావులు కదుపుతూ ఇప్పటికే ఒక మలయాళ చిత్రంతో రీఎంట్రీ కూడా ఇచ్చింది మీరా జాస్మిన్.
- Tags
- విడాకులు