Sat Dec 21 2024 14:32:55 GMT+0000 (Coordinated Universal Time)
చైతు – సామ్ సూపర్ బిజినెస్?
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మన టాలీవుడ్ నటీనటులకు సెట్ అయినట్టు మరెవ్వరికీ సెట్ అవ్వదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లు, [more]
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మన టాలీవుడ్ నటీనటులకు సెట్ అయినట్టు మరెవ్వరికీ సెట్ అవ్వదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లు, [more]
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మన టాలీవుడ్ నటీనటులకు సెట్ అయినట్టు మరెవ్వరికీ సెట్ అవ్వదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లు, యాడ్స్ చేసుకుని డబ్బు వెనక్కి వేసుకుంటున్నారు మన స్టార్స్. ఇందులో మహేష్ బాబు అందరికన్నా ముందు ఉన్నాడు. రీసెంట్ గా ఆయన వినూత్నంగా ఆలోచించి మల్టీప్లెక్స్ బిజినెస్ లో దిగాడు.
అయితే అలానే అక్కినేని నాగ చైతన్య కూడా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నాడట. అయితే అతని కన్ను రియల్ ఎస్టేట్పై పడిందని సమాచారం. వైజాగ్ లో సినీ స్టూడియో లు నిర్మించేందుకు అక్కడ భారీగా భూములు కొనాలని భార్య సమంతతో కలిసి చైతూ ప్లాన్ చేస్తునట్టు వినికిడి.
అందుకు సంబంధించి చైతు – సామ్ అక్కడ బడా బడా రియల్టర్లను కలిసి సమాచారం సేకరిస్తున్నారట. అన్ని సెట్ అయితే వీరు బిజినెస్ లో దిగడం ఎన్నో రోజులు పట్టదు. అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లో దిగాడు. ఏషియన్ వారితో జతకట్టి హైదరాబాద్ అమీర్ పెట్ లో సత్యం థియేటర్ ప్లేస్ లో ఓ భారీ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నాడు.
Next Story