Tue Dec 24 2024 01:30:41 GMT+0000 (Coordinated Universal Time)
మళ్ళీ ఎఫ్ 2 ఆడేసుకునేలా కనబడుతుంది!!
జనవరి 12 న సాదాసీదాగా బాక్సాఫీసు బరిలోకి పెద్ద సినిమాల మీద పోటీకి దిగిన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా ఎవరూ ఊహించని హిట్ [more]
జనవరి 12 న సాదాసీదాగా బాక్సాఫీసు బరిలోకి పెద్ద సినిమాల మీద పోటీకి దిగిన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా ఎవరూ ఊహించని హిట్ [more]
జనవరి 12 న సాదాసీదాగా బాక్సాఫీసు బరిలోకి పెద్ద సినిమాల మీద పోటీకి దిగిన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా ఎవరూ ఊహించని హిట్ అయ్యింది. వెంకటేష్ – వరుణ్ తేజ్ ల కలయికలో మల్టీస్టారర్ మూవీలా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గత రెండు వారాలుగా బాక్సాఫీసు మీద సునామీలా విరుచుకుపడింది. రెండు వారాల్లోనే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల షేర్ ని ఎఫ్ 2 సొంతం చేసుకుంది. మరి రెండు వారాలుగా మిగతా సినిమాలను అంటే ఎన్టీఆర్ కథానాయకుడిని, వినయ విధేయరమని వెనక్కి నెట్టి మరీ వసూళ్ళలో దూసుకుపోయిన ఎఫ్ 2 కి ఈ వారం విడుదలైన మిస్టర్ మజ్ను అడ్డుకట్ట వేస్తుందేమో అని అనుకున్నారు అంతా. మరి అఖిల్ నటించిన మూడో సినిమా మీద భారీ అంచనాలు లేకపోయినా దర్శకుడు వెంకీ అట్లూరి మీద వున్నా అంచనాలతో మిస్టర్ మజ్ను మంచి హిట్ కొడుతుందననుకున్నారు అంతా. ఇక ఎఫ్ 2 కి బ్రేకులే అన్నారు కూడా..
కానీ నిన్న శుక్రవారం విడుదలైన అఖిల్ – వెంకీ అట్లూరిలా మిస్టర్ మజ్ను విడుదలైన మొదటి షోకే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. తన మొదటి సినిమా తీసిన విధంగా వెంకీ అట్లూరి ఈ రెండో సినిమా చెయ్యలేకపోయాడన్నారు ప్రేక్షకులు. తొలిప్రేమను ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను విషయంలో తడబడ్డాడు. అందుకే సినిమాలో అఖిల్ నటన, లుక్స్, హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ ట్రాక్ బావున్నా, రెండు మూడు పాటలు ఓకె అనిపించినా… సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచినా సినిమాకి మాత్రం రివ్యూ రైటర్స్ దగ్గరనుండి ప్రేక్షకులు కూడా యావరేజ్ మార్కులే ఇచ్చారు.
మరి మిస్టర్ మజ్ను కి వహ్చిన ఈ టాక్ తో మళ్ళీ ఎఫ్ 2 పుంజుకునే అవకాశం లేకపోలేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ప్రమోషన్స్ లో వీక్ గా వున్నా ఎఫ్ 2 సినిమా మౌత్ టాక్ తోనే 100 కోట్ల షేర్ తెచ్చింది. ప్రస్తుతం మిస్టర్ మజ్ను టాక్ మాత్రం ఎఫ్ 2 కి కలిసిరావడం ఖాయమని… అందుకే ఈ వరం కూడా ఎఫ్ 2 ఆడేసుకునేలా కనబడుతుందంటున్నారు విశ్లేషకులు.
- Tags
- f2
- à°à°«à± 2
Next Story