షారూఖ్ చిత్రానికి ఏం కష్టాలు వచ్చాయిరా బాబూ...
ఇటీవలి కాలంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస పరాజయాలతో అగ్ర స్థానం నుంచి దిగిపోయే పరిస్థితికి వచ్చేశాడు. హ్యాపీ న్యూ ఇయర్, దిల్వాలే, ఫ్యాన్ చిత్రాలు ఒకదాని తరువాత ఒకటి ప్రేక్షకుల తిరస్కారానికి గురి కావటంతో షారుఖ్ తన పాత్ర నిడివి ని కూడా పట్టించుకోకుండా కథని బలంగా నమ్మి సక్సెస్ ఖాయం అన్న ధీమాతో చేసిన చిత్రం డియర్ జిందగీ. అయితే ఈ చిత్రం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించలేకపోయింది. షారుఖ్ ఖాన్ ఇటీవలి దశాబ్ద కాలంగా అతి తక్కువ వసూళ్లు చేసిన చిత్రం డియర్ జిందగీనే. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయల షేర్ కూడా తాకకముందే ఈ సినిమా వ్యాపారం ముగిసిపోయింది. ఆర్ధిక నష్టంతో పాటు ఈ చిత్రానికి ఇప్పుడు మరిన్ని తలవంపులు వచ్చి పడ్డాయి.
బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన డియర్ జిందగీ చిత్రం విడుదల ఐన నాటి నుంచే ఇది కెనడియన్ ఫిలిం 'బీయింగ్ ఎరికా' కి ఫ్రీమేక్ అనే స్పందన ప్రేక్షకుల నుంచి వస్తున్నది. కానీ పేక్షకుల స్పందనకు చిత్ర బృందం ఏకీభవించలేదు. డియర్ జిందగీ దర్శకురాలు గౌరీ షిండే డియర్ జిందగీ స్క్రిప్ట్ తన ఆలోచనల్లో నుంచి పుట్టినదేనని బలంగా వాదిస్తునప్పటికీ బీయింగ్ ఎరికా చిత్రానికి డియర్ జిందగీ కి అనేక విషయాల్లో దగ్గరి పోలికలు ఉండటంతో ఆవిడ వాదన ఎవరికి నమ్మశక్యంగా లేదు. మరో వైపు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థకి బీయింగ్ ఎరికా నిర్మాతలు కాపీరైట్ నోటీసులు పంపటంతో ధర్మ ప్రొడక్షన్స్ సంస్థకి ఇది అదనపు భారం అయిపోయింది. ఇప్పుడు డియర్ జిందగీ స్క్రిప్ట్ పూర్వాపరాలు పై సరైన వివరణ ఇవ్వలేని పక్షంలో ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- Tags
- sharukh