సై అంటే సై అంటోన్న రేష్మి....!
ఇటీవల విడుదలైన 'గుంటూరు టాకీస్' చిత్రంలో తన అందాల ఆరబోతతో పాటు పలు బోల్డ్ సన్నివేశాల్లో నటించిన 'జబర్ధస్త్' భామ రేష్మి ఈ చిత్రంలో సీన్స్ డిమాండ్ చేయడంతోనే అలా నటించానని, భవిష్యత్తులో కూడా సీన్ డిమాండ్ చేస్తే అలా నటించడానికి తాను సిద్దమేనని ఆమె తెలిపింది. తాను టీవీ షోల కంటే ముందు పలు చిత్రాల్లో నటించానని, కానీ ఆయా దర్శకనిర్మాతలు తన పాత్రను చెప్పేటప్పుడు ఒక విధంగా చెప్పి, చివరకు షూటింగ్లో తన పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా తనను మోసం చేశారని ఆమె ఆరోపించింది. భవిష్యత్తులో కూడా తనకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇస్తే ఎలాంటి సీన్స్‌లోనైనా
నటిస్తానని తెగేసి చెప్పింది. మరోపక్క తాను కావాలంటే ఐటంసాంగ్స్‌లో కూడా నటించడానికి సిద్దమని తెలిపింది. మరి ఈ బుల్లితెర భామ రాబోయే రోజుల్లో మరింత హాట్‌గా కనిపించడం మాత్రం ఖాయమని శృంగార ప్రియులు ఆనందంగా ఉన్నారు.