Sun Jan 12 2025 21:59:55 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ కు షాకిచ్చేలా 100 కోట్లు కొల్లగొట్టిన మరో సౌత్ మూవీ
కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోనా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ ఉంది
బాలీవుడ్ లో స్టార్స్ నటిస్తున్న సినిమాలకు కనీసం కలెక్షన్స్ రావడం లేదు. డిజాస్టర్ టాక్ తప్ప.. కనీసం యావరేజ్ టాక్ దక్కించుకుంటున్న సినిమాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అంతో ఇంతో భూల్ భులయ్య 2, జుగ్ జుగ్ జియో కలెక్షన్స్ సాధించాయి. కశ్మీర్ ఫైల్స్ మాత్రమే క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ సినిమాల పరిస్థితి అలా ఉంటే.. దక్షిణాదిన స్టార్ హీరోల సినిమాలకు మాత్రం కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. మరో సౌత్ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
కిచ్చా సుదీప్ నటించిన తాజా చిత్రం 'విక్రాంత్ రోణ' కు మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ చేరింది. ఆదివారం నాడు రూ.29 కోట్లు వసూలయ్యాయి. తొలి వారంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్ దాటేసింది. 'విక్రాంత్ రోణ' కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా ఐదు భాషల్లో జూలై 28న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. రూ. 95 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. కన్నడలో అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోనా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ ఉంది. KGF చాప్టర్ 2, 777 చార్లీ తర్వాత శాండల్‌వుడ్ నుండి వచ్చిన మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం గత గురువారం విడుదలైంది. విక్రాంత్ రోనాకు మిశ్రమ సమీక్షలు వచ్చాయి. అయితే బాక్సాఫీస్ వద్ద శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పరంగా మంచి దూకుడును చూపించింది.
Next Story