Mon Dec 23 2024 10:59:16 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా..
అమెరికాలో ఎక్కువగా చూసే పాపులర్ టాక్ షో లలో ఒకటి ‘గుడ్ మార్నింగ్ అమెరికా’. ఈ టాక్ షో కు రామ్ చరణ్ గెస్ట్ గా..
టాలీవుడ్ అండ్ పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. అక్కడ ల్యాండ్ అయిన చరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రఖ్యాతి హాలీవుడ్ అవార్డ్స్ HAC (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) కి రామ్ చరణ్ ని ప్రజెంటర్ గా ఆహ్వానించారు. ఈ ఈవెంట్ లో విజేతలుగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ చేతులమీదుగా అవార్డుని అందుకోనున్నారు. ఈనెల 24వ తేదీన బెవర్లీ హిల్స్ లో ఈ అవార్డుల వేడుక జరగబోతోంది. ప్రస్తుతం అక్కడే ఉన్న చరణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది.
అమెరికాలో ఎక్కువగా చూసే పాపులర్ టాక్ షో లలో ఒకటి ‘గుడ్ మార్నింగ్ అమెరికా’. ఈ టాక్ షో కు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లబోతున్నాడు. ఫిబ్రవరి 23న అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఈ టాక్ షో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని హాలీవుడ్ మీడియా అధికారికంగా చెప్పడంతో.. సోషల్ మీడియాలో చరణ్ అభిమానులు హంగామా చేస్తున్నారు. RRRతో చరణ్, ఎన్టీఆర్ ల క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. గతంలో ఏ హీరోలకు దక్కనంత గౌరవం వీరికి దక్కుతోంది. వరుస అవార్డులతో RRR రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు RRR గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ఇటీవలే భారత్ లో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ పురస్కారాన్నీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం RRR ఆశలన్నీ ఆస్కార్ పైనే ఉన్నాయి. ఒక్క ఆ చిత్ర బృందమే కాదు.. యావత్ భారత్ ఈ అవార్డు కోసం ఎదురుచూస్తోంది. మార్చి 13న ఆస్కార్ అవార్డులు వేడుక జరుగనుంది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకోవడంలో సందేహం లేదు అని హాలీవుడ్ మీడియా పేర్కొంటోంది.
Next Story