Mon Dec 23 2024 15:00:47 GMT+0000 (Coordinated Universal Time)
118 కి అదే కలిసొచ్చే అంశం!
చాలా నెలలు తరువాత కళ్యాణ్ రామ్ చిత్రం కు పాజిటివ్ టాక్ వచ్చింది. మొన్న శుక్రవారం విడుదల అయినా 118 సినిమా ను పాజిటివ్ రివ్యూస్ తో [more]
చాలా నెలలు తరువాత కళ్యాణ్ రామ్ చిత్రం కు పాజిటివ్ టాక్ వచ్చింది. మొన్న శుక్రవారం విడుదల అయినా 118 సినిమా ను పాజిటివ్ రివ్యూస్ తో [more]
చాలా నెలలు తరువాత కళ్యాణ్ రామ్ చిత్రం కు పాజిటివ్ టాక్ వచ్చింది. మొన్న శుక్రవారం విడుదల అయినా 118 సినిమా ను పాజిటివ్ రివ్యూస్ తో పాటు మంచి టాక్ కూడా వచ్చింది. కానీ కలెక్షన్స్ చూస్తే మాత్రం ఆ స్థాయిలో కనిపించలేదు. ఓపెనింగ్స్ తక్కువగానే వచ్చాయి. మొదటి రోజు ఈసినిమాని కోటి 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వాస్తంగా ఇది చాలా తక్కువ కలెక్షన్ ఏ కానీ ఒక రకంగా పర్లేదు. ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలకు అమ్మారు. నైజాం, ఆంధ్రా కలిపి స్వయంగా దిల్ రాజే తీసుకున్నాడు. సీడెడ్ ఏమో కోటి కి అమ్ముడుపోయింది.
సో బిజినెస్ ప్రకారం చూసుకుంటే మొదటి రోజు వసూళ్లు కాస్త బెటర్ అనే చెప్పుకోవాలి. ఇక 118 కి కలిసొచ్చే అంశం ఏంటంటే శివరాత్రి ఎఫెక్ట్ ఉంది. సండే, మండే సెలవలు కావడంతో కలెక్షన్స్ పై ప్రవాభం చూపనుంది. మరి ఓవరాల్ గా ఈసినిమా సేఫ్ జోన్ లో కి వెళ్లేనా?
- Tags
- 118
Next Story