Sun Dec 22 2024 22:40:59 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి 18 పేజెస్.. రెండ్రోజుల్లో స్ట్రీమింగ్
సున్నితమైన ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా.. బాగానే వసూళ్లు రాబట్టింది. హీరో, హీరోయిన్ ఒకరినొకరు చూసుకుని ప్రేమించుకోవడం
ఇటీవల కాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన కథా చిత్రాలలో '18 పేజెస్' ఒకటి. నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. సుకుమార్ కథను అందించగా.. బన్నీవాసు సినిమాని నిర్మించారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. డిసెంబర్ 23న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. రవితేజ 'ధమాకా' పోటీని తట్టుకుని నిలబడింది 18 పేజెస్.
సున్నితమైన ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా.. బాగానే వసూళ్లు రాబట్టింది. హీరో, హీరోయిన్ ఒకరినొకరు చూసుకుని ప్రేమించుకోవడం, డ్యూయట్లు పాడుకునే కాన్సెప్ట్ కి పూర్తి భిన్నంగా ఉంటుంది 18 పేజెస్. అందుకే.. ఈ కథలోని ఫీల్ ను ఒడిసిపట్టుకునేవారికే సినిమా బాగా నచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం.. జనవరి 27న ఆహాలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది ఆహా టీమ్.
Next Story