చిరు ఇంట్లో హంగామా చేస్తారా?
1980లో నటించిన సీనియర్ నటులైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రజినీకాంత్, మోహన్ లాల్, రాధికా, సుమలత, జయప్రద, జయసుధ, ఖుష్భు లాంటి నటీనటులు చాలా మంది గత [more]
1980లో నటించిన సీనియర్ నటులైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రజినీకాంత్, మోహన్ లాల్, రాధికా, సుమలత, జయప్రద, జయసుధ, ఖుష్భు లాంటి నటీనటులు చాలా మంది గత [more]
1980లో నటించిన సీనియర్ నటులైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రజినీకాంత్, మోహన్ లాల్, రాధికా, సుమలత, జయప్రద, జయసుధ, ఖుష్భు లాంటి నటీనటులు చాలా మంది గత పదేళ్లుగా ఏదో ఓ మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని అందరూ కలిసి 1980 బ్యాచ్ హంగామా అంటూ రీ యూనియన్ అయ్యి తెగ హంగామా చేస్తున్న ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అందరూ కలిసి ఒకే డ్రెస్ కోడ్ తో ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ తెగ హడావిడి చేస్తున్నారు. గత ఏడాది ఈ సీనియర్ నటులంతా తమ తమ ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేశారు. చిరు తన భార్య సురేఖతో కలిసి ఈ పార్టీలో పాల్గొనడానికి చైనా వెళ్ళాడు. ఇలా వారంతా కలవడం మొదలుపెట్టి ఈ ఏడాదికి తొమ్మిదేళ్లు పూర్తయ్యింది.
దశాబ్ధ వేడుక….
ఈ రీ యూనియన్ పార్టీ మొదలెట్టి 9 ఏళ్ళు పూర్తి చేసుకుని 10వ ఏడాదిలోకి అడుగుపెట్టడంతో.. ఈ ఏడాది ఈ 1980 బ్యాచ్ రీ యూనియన్ పార్టీని చిరు స్పెషల్ గా హోస్ట్ చెయ్యబోతున్నాడు. చిరంజీవి ఈ మధ్యనే తన ఇంటిని రీ మోడలింగ్ చేయించడంతో తన ఇంట్లోనే 1980 బ్యాచ్ రీ యూనియన్ పార్టీ పెట్టబోతున్నట్లుగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. చిరంజీవి ఇంట్లోనే 1980 బ్యాచ్ మొత్తం కలిసి నవంబర్ 23న స్పెషల్ గా పార్టీ చేసుకోబోతున్నట్లుగా చిరు తెలియజేశారు. మరి 1980 బ్యాచ్ ఈ సారి హైదరాబాద్ లో చిరు ఇంట్లోనే ల్యాండ్ అయి ఎంజాయ్ చెయ్యబోతున్నారన్నమాట.