‘2.0’ వల్ల నిండ మునిగిన బయ్యర్లు
ఓవర్ కాంఫిడెన్స్ తో తీసి రిలీజ్ చేసిన సినిమాలు ఎంతో కాలం నిలవవు అని మరోసారి రుజువైంది. శంకర్ డైరెక్షన్ లో భారీ కాస్టింగ్ తో తెరకెక్కించిన [more]
ఓవర్ కాంఫిడెన్స్ తో తీసి రిలీజ్ చేసిన సినిమాలు ఎంతో కాలం నిలవవు అని మరోసారి రుజువైంది. శంకర్ డైరెక్షన్ లో భారీ కాస్టింగ్ తో తెరకెక్కించిన [more]
ఓవర్ కాంఫిడెన్స్ తో తీసి రిలీజ్ చేసిన సినిమాలు ఎంతో కాలం నిలవవు అని మరోసారి రుజువైంది. శంకర్ డైరెక్షన్ లో భారీ కాస్టింగ్ తో తెరకెక్కించిన ‘2.0’ చిత్రం చివరికి లాస్ వెంచరే అయ్యింది. ముందు అనుకుందే ఇప్పుడు నిజం అయింది. 550 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం కు ఎంత పబ్లిసిటీ చేసిన ఫలితం లేకపోయింది. ఒక్క హిందీ వర్షన్ మినహాయిస్తే మిగిలిన అని చోట్ల ఈసినిమా ‘2.0’ చివరికి లాస్ వెంచరే అయ్యింది.
అన్ని చోట్ల ఏమోకానీ తమిళంలో ఈసినిమా బయ్యర్లను నిలువునా ముంచేసింది. అక్కడ ఈసినిమాను రూ.100 కోట్లకు పైగా అమ్మారు. కానీ థియేట్రికల్ రన్ ముగిసేసరికి 60 కోట్లు మాత్రమే వసూల్ చేయగలిగింది. ఇంకా 40 కోట్లు రావాల్సినుంది. సో ఈమూవీ వల్ల 40 కోట్లు బయర్స్ కి నష్టమే అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
తమిళంలో తో పోల్చుకుంటే తెలుగు పర్లేదు కానీ ఇక్కడ కూడా నష్టాలు తప్పలేదు. తెలుగు లో ఈమూవీ దిల్ రాజు… ఎన్వీ ప్రసాద్ కలిసి రూ.72 కోట్ల కు రిలీజ్ చేసారు. కానీ ఫుల్ రన్ లో రూ.55 కోట్లే వచ్చాయి. అంటే ఇంకా రికవరీ అవ్వలంటే 17 పైనే రావాలి. సో తెలుగు లో కూడా నష్టాలు తప్పలేదు కానీ మరీ తమిళం లా కాదు . రిలీజ్ కి ముందు వారం రిలీజ్ కి తరువాత ఈసినిమాకు ఏ సినిమా పోటీ లేకపోవడంతో ఇంత మాత్రమైనా వసూల్ వచ్చాయి అంటున్నారు. అయితే హిందీ లో మాత్రం ‘2.0’ బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చింది అక్కడ కరణ్ జోహార్ ఈమూవీ ను రూ.100 కోట్లకు కొంటె ఇప్పుడు దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసి బయర్స్ ను సేఫ్ జోన్ లోకి పడేసింది