అనుకున్నంత లేదంటున్నారుగా
ఎప్పటినుండో 2.0 సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ మధ్యలో గ్రాఫిక్స్ పనుల లేట్ తో సినిమా విడుదల కూడా లేట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం విడుదల సమయం దగ్గరపడుతున్న టైం లో 2.0 సినిమా ప్రమోషన్స్ తో శంకర్ అండ్ టీం పిచ్చెక్కించే ఏర్పాట్లు చేశారు. ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లోని ప్రతి ఒక్క విషయంపై ప్రేక్షకులు కూడా భారీగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఆ అంచనాలు అందుకునేలా శంకర్ 2.0 సినిమాని తెరకెక్కించాడనేది నిన్న శనివారం చెన్నై లో విడుదల చేసిన 2.0 ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది చెప్పిన మాట.
అయితే సోషల్ మీడియాలో 2.0 ట్రైలర్ మీద కామెంట్స్ మరోలా ఉన్నాయి. శంకర్ - రజినీకాంత్ కాంబోలో తెరకెక్కిన ఈ 2.0 సినిమా మరి ఓవర్ గ్రాఫిక్స్ తో ఉన్నదనే టాక్ వినబడుతుంది. అలాగే ప్రేక్షకుల అంచనాలను ఈ 2.0 సినిమా ట్రైలర్ అందుకునేలా లేదని కొందరి వాదన. ట్రైలర్ చూస్తే విజువల్స్ భారీగా ఉన్నప్పటికీ, ప్రేక్షకులు వావ్ అంటూ థ్రిల్ అయ్యేవిధంగా ఎక్కడా కనబడలేదని..చాలామంది డిజప్పాయింట్ అవుతున్నారు. ఇక అక్షయ్ కుమార్ పాత్రకు చెప్పిన డబ్బింగ్ ట్రైలర్ రెండు మూడు సార్లు చూస్తే గాని అర్ధమయ్యేలా లేదని అంటున్నారు.
మరి బాహుబలి ని తలదన్నేలా సౌత్ నుండి మరో భారీ అంటే 600 కోట్ల బడ్జెట్ మూవీ వస్తుందని ఆశపడ్డ చాలామంది సినీ లవర్స్ కి ఈ 2.0 సినిమా ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఇవ్వడం లేదనేది లేటెస్ట్ న్యూస్. అందుకేనేమో 2.0 యూట్యూబ్ రికార్డ్స్ ని కొల్లగొటింది... అని ఎక్కడా ఆ టాపిక్ చర్చకే రాకుండా పోయింది