Mon Dec 23 2024 10:17:53 GMT+0000 (Coordinated Universal Time)
2018 డిసెంబర్ని రిపీట్ చేస్తారా..? లేదా మార్చి రాస్తారా..?
2023 డిసెంబర్, 2018 డిసెంబర్ కొన్ని విషయాల్లో ఒకేలా ఉంది. 2018 డిసెంబర్ లో ధనుష్, షారుఖ్ ఖాన్, ప్రశాంత్ నీల్..
ఈ ఏడాది డిసెంబర్ లో నార్త్ టు సౌత్ పలువురు సూపర్ స్టార్స్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఈసారి ఇయర్ ఎండ్ గ్రాండ్ గా ఉండబోతుంది. కాగా ఇక్కడ ఒకటి గమనిస్తే.. 2023 డిసెంబర్, 2018 డిసెంబర్ కొన్ని విషయాల్లో ఒకేలా ఉంది. 2018 డిసెంబర్ లో ధనుష్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ఏడాది డిసెంబర్ లో కూడా వీరి చిత్రాలు రేసులో ఉన్నాయి.
2018 లో ధనుష్ - మారి 2, మోహన్ లాల్ - ఒడియన్, షారుఖ్ ఖాన్ - జీరో, ప్రశాంత్ నీల్ - కెజిఎఫ్1 సినిమాలతో పాటు హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ మూవీ కూడా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఏడాది చూసుకుంటే.. ధనుష్'కెప్టెన్ మిల్లర్', మోహన్ లాల్ 'నీరు', షారుఖ్ ఖాన్ 'డుంకి', ప్రశాంత్ నీల్ 'సలార్', హాలీవుడ్ మూవీ 'ఆక్వామెన్ 2' రిలీజ్ కాబోతున్నాయి. ఇలా 2018 డిసెంబర్, 2023 డిసెంబర్ చూడడానికి కొంచెం ఒకేలా ఉంది.
ఇక అప్పటి రిజల్ట్స్ విషయానికి వస్తే.. సూపర్ హిట్ మూవీ 'మారి'కి సీక్వెల్ గా వచ్చిన 'మారి 2' ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. 'ఒడియన్' సినిమా సంగతి కూడా అంతే. భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి భారీ ఓపెనింగ్స్ సాదించినప్పటికీ మిక్స్డ్ టాక్ తో సరి పెట్టుకుంది. ఇక ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కెజిఎఫ్-1 సూపర్ హిట్టుగా నిలిచింది.
షారుఖ్ ప్రయోగం చేస్తూ చేసిన 'జీరో' బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక DC యూనివర్స్ నుంచి వచ్చిన కొత్త సూపర్ హీరో మూవీ 'ఆక్వామెన్'కి మంచి మార్కులే పడ్డాయి. మరి ఈ ఫలితాలను ఇప్పుడు కూడా రిపీట్ చేస్తారా..? లేదా కొత్త రిజల్ట్స్ తో ఈ డిసెంబర్ ని మార్చి రాస్తారా చూడాలి. కెప్టెన్ మిల్లర్ - డిసెంబర్ 15, నీరు - డిసెంబర్ 21, డుంకి - డిసెంబర్ 22, సలార్ - డిసెంబర్ 22, ఆక్వామెన్ 2 - డిసెంబర్ 20 రిలీజ్ కాబోతున్నాయి.
Next Story