Mon Dec 23 2024 04:13:56 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind Top Heroes : ఈ హీరోలకు కమ్‌బ్యాక్ తీసుకొచ్చిన ఈ ఏడాది..
ఏళ్ళ తరబడి ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న రజినీ, షారుఖ్, ప్రభాస్‌కు 2023.. బ్లాక్ బస్టర్ తీసుకొచ్చి వారికీ గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది.
2023 Rewind : ఈ ఏడాది ఎవరికి ఎలా సాగినా.. ఇండియన్ సూపర్ స్టార్స్(top heroes)రజినీకాంత్, షారుఖ్ ఖాన్, ప్రభాస్‌కు మాత్రం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఏళ్ళ తరబడి ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ ముగ్గురికి 2023.. బ్లాక్ బస్టర్ విజయాన్ని తీసుకొచ్చి వారికీ గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆ కమ్‌బ్యాక్ లు వైపు ఓ లుక్ వేసేయండి.
#రజినీకాంత్..
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది 'జైలర్'(Jailer)సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 650 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రజినీకాంత్ కి సూపర్ కమ్‌బ్యాక్ గా మారింది. రజినికి ఇలాంటి ఓ హిట్ పడి దాదాపు 23 ఏళ్ళ అయ్యింది. 2010లో వచ్చిన 'రోబో' తరువాత రజినీకి తన స్థాయి హిట్ పడలేదు.
మధ్యలో భారీ అంచనాలతో వచ్చిన లింగా, కబాలి, పేట, దర్బార్ సినిమాలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఇక రోబోకి సీక్వెల్ గా తెరకెక్కిన '2.0'కి 690 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా తీయడానికే 600 కోట్లు ఖర్చు అయ్యాయి. కాబట్టి కమర్షియల్ గా ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాదనే చెప్పాలి. ఇక 200 కోట్లతో తెరకెక్కిన 'జైలర్' 650 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
#షారుఖ్ ఖాన్..
కమ్‌బ్యాక్ లోనే గ్రాండ్ కమ్‌బ్యాక్ అంటే.. అది షారుఖ్‌ది అనే చెప్పాలి. ఈ ఏడాది ఒక దానిని మించిన విజయం మరొకటి అందుకొని కమ్‌బ్యాక్ స్టార్ అనిపించుకున్నారు. 2013లో వచ్చిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' తరువాత.. ఒక హిట్ అందుకోలేకపోయారు. హ్యాపీ న్యూ ఇయర్, దిల్ వాలే వంటి ఎంటెర్టైనెర్స్ ఆకట్టుకోలేదు. జీరో, ఫ్యాన్ వంటి ప్రయోగాలు వర్క్ అవుట్ అవ్వలేదు.
ఇక ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో వచ్చిన షారుఖ్ ఖాన్.. బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని.. ప్రస్తుతానికి ఈ ఏడాది టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఆ తరువాత వచ్చిన 'జవాన్' సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని గ్రాసర్స్ లిస్ట్ లో వన్ ప్లేస్ లో ఉంది. ఇక ఏడాది చివరిలో 'డంకీ' తీసుకు వచ్చారు. ప్రస్తుతం ఇది 300 కోట్ల వరకు రాబట్టి.. సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.
#ప్రభాస్..
బాహుబలి సినిమాలతో ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో స్టార్డమ్ ని సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తరువాత హిట్ అందుకోవడానికి దాదాపు ఆరేళ్ళు పట్టింది. బాహుబలి తరువాత భారీ అంచనాలతో వచ్చిన 'సాహో' సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టినా.. ప్రభాస్ స్థాయి విజయాన్ని నమోదు చేయలేక యావరేజ్ అనిపించుకుంది. ఇక ఆ తరువాత వచ్చిన 'రాదే శ్యామ్' కలెక్షన్స్ కూడా రాబట్టలేక ప్లాప్ గా నిలిచింది.
ఇక ఈ ఏడాది ప్రభాస్ ని రాముడిగా చూపిస్తూ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' నేషనల్ వైడ్ ఎన్నో అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఆ అంచనాలతో భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది. కానీ రామాయణ కథని కించపరిచేలా సినిమా తెరకెక్కించారని అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
దీంతో ప్రభాస్ అభిమానులు తమ ఆశలు అన్ని 'సలార్' పైనే పెట్టుకున్నారు. ఆ అంచనాలను సలార్ అందుకొని కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఆరు రోజుల్లోనే 500 కోట్ల మార్క్ ని దాటేసిన ఈ చిత్రం.. ఈ ఏడాది టాప్ ప్లేస్ లో ఉన్న జవాన్, పఠాన్ లో ఏదో ఓ స్థానాన్ని కబ్జా చేయడం ఖాయంలా కనిపిస్తుంది. వీల్లే Top 10Heroesలో ముగ్గురు హిట్ లు దక్కించుకున్నారు
Next Story