Tue Nov 05 2024 16:48:57 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : ఈ ఏడాది గూగుల్ సెర్చ్లో ఈ సినిమాలే టాప్..
ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు ఏవి అనేవి కూడా ఈ ఆర్టికల్ చదివేసి తెలుసేసుకోండి.
2023 Rewind : న్యూ ఇయర్ వచ్చేస్తుంది. దీంతో కొత్త సంవత్సరం కొత్త ప్రయాణం మొదలుపెట్టబోయే ముందు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం మొదలు పెట్టారు అందరూ. మరి ఈక్రమంలోనే ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు ఏవి అనేవి కూడా ఈ ఆర్టికల్ చదివేసి తెలుసేసుకోండి.
ఈ ఏడాది టాలీవుడ్ నుంచి పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి రిలీజ్ కాలేదు. దీంతో ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల సందడి కనిపించింది. ఇక ఈ ఏడాది ఇండియా వైడ్ గూగుల్ లో ఎక్కువుగా సెర్చ్ చేసిన సినిమాల లిస్టులో.. షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని ఈ ఇయర్ టాప్ గ్రాసర్ కూడా నిలిచింది.
ఇక ఈ సెర్చింగ్ లిస్టులో సెకండ్ ప్లేస్ లో కూడా బాలీవుడ్ మూవీ 'గదర్ 2'నే నిలిచింది. మూడో ప్లేస్ లో హాలీవుడ్ మూవీ 'ఓపెన్హైమర్' నిలిచింది. ఆ తరువాత ప్రభాస్ 'ఆదిపురుష్' నాలుగో స్థానం దక్కించుకుంది. ప్రభాస్ రాముడిగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి.. ప్లాప్ టాక్ ని సొంతం చేసుకోవడమే కాదు, ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఈ సినిమా తరువాత షారుఖ్ 'పఠాన్' ఐదో స్థానంలో నిలిచింది.
వీటి తరువాత 6-10 స్థానాలలో ది కేరళ స్టోరీ, జైలర్, లియో, టైగర్ 3, వరిసు చిత్రాలు నిలిచాయి. ఈ టాప్ లిస్టులో టాలీవుడ్ హీరోకి సంబంధించిన సినిమా ఒక్కటే ఉండడం విశేషం. ఈ ఏడాది పూర్తిగా బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల డామినేషనే కనిపించింది. గ్లోబల్ వైడ్ గూగుల్ సెర్చ్ లో కూడా ఈ ఏడాది తెలుగు సినిమాలు సత్తా చాటలేకపోయాయి.
గ్లోబల్ వైడ్ ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువుగా సెర్చ్ సినిమాల్లో బార్బీ, ఓపెన్హైమర్.. మొదటి రెండు స్థానాల్లో నిలువగా, మూడో స్థానంలో షారుఖ్ 'జవాన్' ఉండడం గమనార్హం. ఈ టాప్ లిస్టులో షారుఖ్ మరో మూవీ 'పఠాన్' కూడా స్థానం దక్కించుకుంది. పఠాన్ పదో స్థానంలో నిలిచింది. మరో బాలీవుడ్ మూవీ గదర్ 2 ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ఇక గ్లోబల్ వైడ్ సెర్చ్ లో కూడా షారుఖ్ కి సంబంధించిన రెండు సినిమాలు ఉండడంతో.. ఇండియన్ సినిమా రియల్ బాద్షా, కింగ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Next Story