Mon Dec 23 2024 08:13:28 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : గూగుల్ టాప్ సెర్చ్లో బాలీవుడ్ జంట.. ఇంకెవరు ఉన్నారు..?
ఈ ఏడాది ఏ సెలబ్రిటీ ఎక్కువ నెట్టింట వైరల్ అయ్యారు. ఎవరు గురించి నెటిజెన్స్ గూగుల్ లో ఎక్కువుగా సెర్చ్ చేశారు..?
2023 Rewind : మరికొన్ని గంటల్లో 2023కి గుడ్ బై చెప్పేసి 2024కి వెల్కమ్ చెప్పబోతున్నాము. మరి ఈ ఏడాది ఏ సెలబ్రిటీ ఎక్కువ నెట్టింట వైరల్ అయ్యారు. ఎవరు గురించి నెటిజెన్స్ గూగుల్ లో ఎక్కువుగా సెర్చ్ చేశారు..? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ని చదివేయండి.
ఈ ఏడాది నెటిజెన్స్.. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి ఎక్కువ సెర్చ్ చేశారట. ఈ ఏడాది కియారా అద్వానీకి పెళ్ళైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని కియారా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో వీరి పెళ్లి విషయాలు కోసం నెటిజెన్స్ తెగ సెర్చ్ చేశారు. ఈక్రమంలోనే ఇండియా వైడ్ గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన జాబితాలో కియారా అద్వానీ మొదటి స్థానంలో ఉంటే.. ఆ తరువాత స్థానాల్లో భారత క్రికెటర్ శుభమాన్ గిల్, న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర, భారత ఆటగాడు మహమ్మద్ షమీ, ప్రముఖ ఇండియన్ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఉన్నారు.
ఇక కియారాతో పాటు ఆమె భర్త సిద్దార్థ్ మల్హోత్రా గురించి కూడా సెర్చ్ చేయడంతో.. ఈ జాబితాలో అతను ఆరో స్థానంలో నిలిచారు. కాగా ఈ ఇద్దరు కలిసి 2021లో 'షేర్షా' అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి ముందు వరకు రహస్య ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ.. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఏడడుగులు వేశారు.
కాగా కియారా అద్వానీ ఇండియన్ గూగుల్ సెర్చ్ లో మాత్రమే కాదు. గ్లోబల్ వైడ్ గూగుల్ సెర్చ్ లో కూడా స్థానం దక్కించుకున్నారు. గ్లోబల్ వైడ్ గూగుల్ సెర్చ్ చేసిన టాప్ 10 లిస్టులో కియారా.. 9వ స్థానంలో నిలిచారు. గ్లోబల్ టాప్ సెర్చ్ లో స్థానం దక్కించుకున్న ఏకైక ఇండియన్ కియారా అద్వానీ మాత్రమే. దీంతో ఈ ఇయర్ గూగుల్ క్వీన్ గా కియారా అద్వానీ నిలిచారు.
Next Story