Sun Nov 17 2024 19:25:50 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : ఈ ఏడాది BGMతో మరో రేంజ్కి వెళ్లిన సినిమాలు ఇవే..
2023లో వచ్చిన చాలా సినిమాల్లో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. నిజం చెప్పాలంటే కొన్ని సినిమాలు మ్యూజిక్ వలనే హిట్ అయ్యాయి.
2023 Rewind : ఈ ఏడాది వచ్చిన చాలా సినిమాల్లో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. నిజం చెప్పాలంటే కొన్ని సినిమాలు అయితే ఆ మ్యూజిక్ వలనే హిట్ అయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా ఈ ఏడాది BGMతో మరో రేంజ్కి వెళ్లిన సినిమాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
జైలర్..
రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. ఈ మూవీకి అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలైట్. జైలర్ సక్సెస్ ఈవెంట్ లో రజినినే ఈ విషయం మాట్లాడారు. బ్యాక్గ్రౌండ్ లేకముందు జైలర్ కేవలం ఓ యావరేజ్ సినిమా అని చెప్పారు.
లియో..
లోకేష్ కానగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన 'లియో'కి కూడా అనిరుదే సంగీతం అందించారు. ఈ మూవీ స్టోరీ ఆడియన్స్ ఆశించిన స్థాయిలో లేదు. కానీ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ రొటీన్ కథకి హెల్ప్ చేసింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయానే అందుకుంది.
దసరా..
నాని ఊరమస్ లుక్ లో కనిపిస్తూ వచ్చిన 'దసరా'కి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఇలాంటి ఓ మాస్ కమర్షియల్ సినిమాకి సంతోష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ ని ఇచ్చింది. ఈ చిత్రంతో నాని 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారు.
మంగళవారం..
ఆర్ఎక్స్100 తరువాత అజయ్ భూపతి, పాయల్ రాజ్పుత్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'మంగళవారం'. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ కి గూస్బంప్స్ తెప్పించింది.
యానిమల్..
అర్జున్ రెడ్డి సినిమాకి అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్.. 'యానిమల్'కి కూడా BGM అందించారు. ఇక ఈ మూవీ సౌండ్ ట్రాక్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా రిలీజైన కళ్యాణ్ రామ్ 'డెవిల్' కూడా హర్షవర్ధన్ ఇచ్చిన సౌండ్ ట్రాక్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది.
కింగ్ ఆఫ్ కోత..
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'కింగ్ ఆఫ్ కోత'కి జేక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్.. యూత్ ని బాగా ఆకట్టుకుంది. సినిమా విజయం సాధించడానికి ఇదే మెయిన్ పాయింట్ అని చెప్పొచ్చు.
Next Story