Fri Dec 20 2024 12:41:39 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : ఈ ఏడాది టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఈ ఏడాది టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అనిపించుకున్న భామ ఎవరో తెలుసా..? టాలీవుడ్ క్వీన్ చైర్‌ని ఎవరు సొంతం చేసుకున్నారు..?
2023 Rewind : మరో ఆరు రోజుల్లో 2023కి గుడ్ బై చెప్పేబోతున్నాము. మరి ఈ ఏడాది టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అనిపించుకున్న భామ ఎవరో తెలుసా..? ఈ సంవత్సరం కొత్త హీరోయిన్స్ తో పాటు సీనియర్ హీరోయిన్స్, స్టార్ హీరోయిన్స్ కుడి ఆడియన్స్ ముందుకు వచ్చారు. మరి వీరిలో టాలీవుడ్ క్వీన్ చైర్‌ని ఎవరు సొంతం చేసుకున్నారు..?
శ్రుతిహాసన్..
ఈ ఏడాది శ్రుతికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇయర్ స్టార్టింగ్ లోనే బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య', బాలయ్యతో 'వీరసింహారెడ్డి' సినిమాల్లో నటించి 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నారు. ఇక ఇయర్ ఎండ్ లో ప్రభాస్ 'సలార్' సినిమాలో నటించి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఇక ఈ చిత్రాలతో పాటు నాని 'హాయ్ నాన్న'లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి విజయాన్ని అందుకున్నారు.
శ్రీలీల..
ఈ ఏడాది చివరిలో నెలకు ఓ సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన శ్రీలీల.. సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు. రామ్ 'స్కంద', నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ', వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ఈ మూడు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. బాలయ్య 'భగవంత్ కేసరి' నటించి సక్సెస్ అందుకున్నప్పటికీ.. అందులో హీరోయిన్ గా చేసింది కాజల్ అగర్వాల్.
సమంత..
గుణశేఖర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన 'శాకుంతలం' బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇక విజయ్ దేవరకొండ సరసన నటించిన 'ఖుషి'.. థియేటర్స్ లో అలరించినప్పటికీ కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ లేదు. దీంతో ఈ ఏడాది టాలీవుడ్ సామ్ హవా పెద్ద కనిపించలేదు.
సంయుక్త మీనన్..
భీమ్లా నాయక్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త.. వరుస సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ధనుష్ 'సార్', సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్ గా మంచి ప్రాధాన్యత ఉంటుంది.
కాజల్, తమన్నా, అనుష్క..
సీనియర్ హీరోయిన్స్ కాజల్, తమన్నా ఈ ఏడాది ఒక్కో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. బాలయ్య 'భగవంత్ కేసరి'తో కాజల్ అగర్వాల్ హిట్ అందుకుంటే, చిరంజీవి 'భోళాశంకర్'తో తమన్నా ప్లాప్ ని అందుకున్నారు. ఇక అనుష్క శెట్టి చాలా గ్యాప్ తరువాత 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
కృతిసనన్, మృణాల్, కీర్తి సురేష్..
బాలీవుడ్ భామలు కృతిసనన్, మృణాల్ ఠాకూర్ కూడా ఒక్కో సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించారు. కృతిసనన్, ప్రభాస్‌తో 'ఆదిపురుష్' సినిమాలో నటించి ప్లాప్ ని అందుకుంటే, మృణాల్, నానితో 'హాయ్ నాన్న'లో నటించి బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నారు. నాని 'దసరా'లో నటించిన కీర్తి సురేష్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ నే అందుకున్నారు. ఈ మూవీలో పెళ్లి బారాత్ లో కీర్తి వేసిన డాన్స్ టాలీవుడ్ లో బాగా వైరల్ అయ్యింది.
పాయల్ రాజ్‌పుత్, నేహా శెట్టి..
ఆర్ఎక్స్100 తరువాత సరైన హిట్టు లేని పాయల్ రాజ్‌పుత్.. 'మంగళవారం'తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఆర్ఎక్స్100 దర్శకుడే తెరకెక్కించాడు. కార్తికేయ 'బెదురులంక 2012'లో నటించి మంచి హిట్టుని అందుకున్న నేహశెట్టి.. కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్'తో ప్లాప్ ని అందుకున్నారు. అయితే ఈ సినిమాలో 'సమ్మోహనుడ' సాంగ్ తో బాగా వైరల్ అయ్యారు.
కావ్య, వైష్ణవి..
టాలీవుడ్ జూనియర్ హీరోయిన్స్ కావ్య కళ్యాణ్‌రామ్, వైష్ణవి చైతన్య ఈ ఏడాది భారీ విజయాలనే అందుకున్నారు. వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన 'బలగం' సినిమాలో కావ్య హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ సంపాదించుకొని హీరోయిన్ గా పరిచయం అవుతూ వైష్ణవి చేసిన సినిమా 'బేబీ'. ఈ మూవీ ఈ ఏడాది చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది చిన్న సినిమాల్లో మొదటి రెండు స్థానాల్లో బేబీ, బలగం ఉన్నాయి.
ఈ విజయాలు రిజల్ట్ బట్టి చూస్తే.. ఈ ఏడాది టాలీవుడ్ క్వీన్ చైర్‌ని శ్రుతిహాసన్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఆమె తరువాత స్థానంలో సంయుక్త మీనన్, కావ్య కళ్యాణ్‌రామ్, వైష్ణవి చైతన్య ఉన్నారని చెప్పొచ్చు.
Next Story