Fri Dec 20 2024 12:22:18 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : ఈ ఏడాది బాలీవుడ్లో వచ్చిన వరస్ట్ మూవీస్ ఇవే..
ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి థియేటర్స్ కి వచ్చి నార్త్ ఆడియన్స్ కి విసుగు తెప్పించిన సినిమాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
2023 Rewind : ఈ నెలతో ఈ ఏడాది ముగిస్తుంది. మరి ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి థియేటర్స్ కి వచ్చి నార్త్ ఆడియన్స్ కి విసుగు తెప్పించిన సినిమాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
షెహజాదా..
కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం.. టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన 'అల వైకుంఠపురములో' సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. రోహిత్ ధావన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆడియన్స్ కి విసుగు తెప్పించింది.
మిషన్ మజ్ను..
సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఇండో పాకిస్తాన్ వార్ కథాంశంతో ఒక స్పై థ్రిల్లర్ గా తెరకెక్కింది. రష్మిక మందన్న ఈ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఫ్లాట్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టించింది.
తు ఝూతి మెయిన్ మక్కార్..
రణబీర్ కపూర్, శ్రద్దా కపూర్ హీరోహీరోయిన్స్ నటించిన ఈ రొమాంటిక్ లవర్ ఎంటర్టైనర్..
బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ప్రేమని ఫీల్ అయ్యేలా చేయలేకపోయింది. శృతిమించిన రోమాన్స్తో చిరాకు తెప్పించింది.
కిసీకా భాయ్ కిసీకి జాన్..
సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే నటించిన ఈ చిత్రం.. తమిళ మూవీ 'వీరమ్'కి రీమేక్ గా తెరకెక్కింది. తెలుగులో ఈ చిత్రాన్ని పవన్ 'కాటమరాయుడు'గా చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే సల్మాన్ మూవీలో వెంకటేష్, జగపతి బాబు ముఖ్య పాత్రలు చేయగా.. ఒక సాంగ్ రామ్ చరణ్ కనిపించారు. రొటీన్ కథతో వస్తే ఎన్ని స్పెషలిటీస్ ఉన్న ఏం లాభం.
బ్లడీ డాడీ..
షాహిద్ కపూర్ హీరోగా వచ్చిన ఈ మూవీ.. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'స్లీప్ లెస్ నైట్' రీమేక్ గా వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో యాక్షన్ కాదు కదా, స్టోరీ కూడా లేకపోవడంతో అభిమానులకు సైతం విసుగు వచ్చింది.
ఆదిపురుష్..
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్.. బాలీవుడ్ సినిమాగానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. రామాయణ కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన తీరు.. దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. దేవుడైన హనుమంతుడి చేత అభ్యంతరకర వ్యాఖ్యలు చెప్పించి హిందువులకు కోపం వచ్చేలా చేశారు.
ది లేడీ కిల్లర్..
అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి IMDb 1.5 రేటింగ్ ఇచ్చింది. కాబట్టి ఈ చిత్రం గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచింది. బాలీవుడ్ లోనే ఈ ఏడాది వరస్ట్ మూవీగా నిలిచింది.
గణపథ్..
టైగర్ ష్రాఫ్, కృతిసనన్, అమితాబ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం గణపథ్.. రెండు భాగాలుగా రూపొందుతుంది. ఫ్యూచర్ డేస్ మోడరన్ టెక్నాలజీ కాన్సెప్ట్ తో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది. టైగర్ ష్రాఫ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. దీంతో సెకండ్ పార్ట్ పక్కన పడినట్లు అయ్యింది.
థాంక్యూ ఫర్ కమింగ్..
భూమి పెడ్నేకర్, డాలీ సింగ్, షెహ్నాజ్ గిల్, షిబానీ బేడి, కుశ కపిల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం సెక్స్ కామెడీ నేపథ్యంతో అడల్ట్ కంటెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి చివాట్లు పెట్టించుకుంది.
యానిమల్..
రణబీర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇండియా వైడ్ భారీ కలెక్షన్స్ అందుకున్నప్పటికీ.. కంటెంట్ పరంగా బాలీవుడ్ టు టాలీవుడ్ చాలామందికి విసుగు తెప్పిచింది. బోల్డ్ అండ్ వైల్డ్ కంటెంట్ తో యూత్ ని పెడదారి పట్టించేలా ఉన్న ఈ చిత్రం పై పార్లమెంట్ లో కూడా విమర్శలు చేయడం విశేషం.
Next Story