Mon Dec 23 2024 03:02:31 GMT+0000 (Coordinated Universal Time)
2024 సంక్రాంతికి సినిమా జాతర ఉండబోతుంది..
2024 సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఈసారి చాలామంది హీరోలు పోటీపడుతున్నారు. వీరిలో కొందరు ఆల్రెడీ డేట్ ని ఫిక్స్ చేసుకుంటే..
తెలుగు ఆడియన్స్ కి సంక్రాంతి అంటేనే కోడిపందాలు, సినిమాల సంబరం అన్నట్టు ఉంటుంది. అలాంటి పండక్కి తమ సినిమాని తీసుకు రావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ కొందరు మాత్రమే ఆ బరిలో నిలుస్తారు. అయితే 2024 సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఈసారి చాలామంది హీరోలు పోటీపడుతున్నారు. వీరిలో కొందరు ఆల్రెడీ డేట్ ని ఫిక్స్ చేసుకుంటే.. కొందరు ఇంకా ఆలోచనలో ఉన్నారు. మరి ఆ పండగ పందెం కోళ్లు లిస్ట్ ఒకసారి మీరుకూడా చూసేయండి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ కమర్షియల్ మూవీ 'గుంటూరు కారం' ఇప్పటికే పోస్టుపోన్ అయిన ఈ మూవీ సంక్రాంతి భారీ నుంచి తగ్గేదిలేదు, రావడం పక్కా అంటుంది. జనవరి 12న బాక్స్ ఆఫీస్ కి గుంటూరు కారం ఘాటు చూపిస్తాను అంటుంది. ఇక అదే రోజు యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ జనవరి 12కి తీసుకు రావడం పక్కా, అందులో ఎటువంటి మార్పు ఉండదని దర్శకుడు ప్రశాంత్ వర్మ రీసెంట్ గా కూడా తెలియజేశాడు.
ఇక రవితేజ నటిస్తున్న 'ఈగల్' మూవీ డేట్ ని కూడా ఇటీవలే ఫైనల్ చేశారు. కొత్త దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కాబోతుంది. ఈ మూడు సినిమాలు డేట్స్ అనౌన్స్ చేసి బరిలో తమ స్థానాలను కన్ఫార్మ్ చేసుకున్నాయి. ఇక డేట్ అనౌన్స్ చేయకుండా సంక్రాంతికి వస్తున్నాము అని ప్రకటించిన సినిమాలు గురించి చెప్పాలంటే.. నాగార్జున ‘నా సామిరంగ’, రజినీకాంత్ 'లాల్ సలామ్', విజయ్ దేవరకొండ ‘VD13’, తమిళ హీరో శివకార్తికేయన్ ‘అయలాన్’ సినిమాలు పండక్కి వస్తాయంటూ ప్రకటించారు.
అయితే ఈ చిత్రాలు డేట్ అనౌన్స్ చేయకపోవడంతో వీటిలో కొన్ని సినిమాలు పోస్టుపోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక పండగ భారీ నుంచి తప్పుకున్న సినిమాలు, పండక్కి బరిలో నిలిచేందుకు చూస్తున్న సినిమాలు గురించి మాట్లాడుకుంటే.. ప్రభాస్ 'కల్కి 2898 AD' సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆ మూవీ ఆల్మోస్ట్ పోస్టుపోన్ అయ్యిపోయింది.
ఇక ఈ క్రిస్ట్మస్ కి రావాల్సిన వెంకటేష్ ‘సైంధవ్’.. ఇప్పుడు సంక్రాంతికి వచ్చేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ డేట్ పై కూడా క్లారిటీ రానుంది. అలాగే పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ అనుకున్నట్లు పూర్తి అయితే.. అది కూడా పండక్కి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. దానికి తగ్గట్లే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.
Next Story