Mon Nov 18 2024 00:40:10 GMT+0000 (Coordinated Universal Time)
Sankranthi Movies : ఈ సంక్రాంతి సినిమా రిలీజ్ల లిస్ట్ ఇదే..
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలుస్తున్న సినిమా లిస్టు ఏంటో చూసేయండి.
Sankranthi Movies : తెలుగువారు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. బంధువులంతా ఒక చోట కలిసి ఈ పండగని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఇక ఈ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి కొత్త సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ పండుగ సమయంలో సినిమా హిట్ ప్లాప్ టాక్ తో సంబంధం ఉండదు. కుటుంబమంతా కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేశామా లేదా అనే ప్రేక్షకులు చూస్తుంటారు. దీంతో ఆ టైములో రిలీజ్ అయ్యే సినిమాలకు కాసుల వర్షం కురుస్తుంది.
అందుకనే ఫిలిం మేకర్స్ ఆ సమయంలో తమ సినిమాలను తీసుకు వచ్చేందుకు పోటీ పడుతుంటారు. ఈక్రమంలోనే ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ కనిపించింది. దాదాపు అరడజను సినిమాలు పండక్కి వచ్చేందుకు పోటీ పడ్డాయి. అయితే అన్ని సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టం, దీంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకనే నిర్మాతలందరూ కలిసి చర్చించుకొని ఒక రెండు సినిమాలను పోస్టుపోన్ చేసుకున్నారు. మరి అలా పోస్టుపోన్ అయిన సినిమాలు ఏంటి..? పండక్కి రాబోతున్న సినిమాలు ఏంటి..?
ఫ్యామిలీ స్టార్..
పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరోసారి నటిస్తున్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పోస్టుపోన్ చేసి సమ్మర్ కి తీసుకు వెళ్లారు.
ఈగల్..
రవితేజ నటిస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్ డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతికి రావడానికి అన్ని సిద్ధం చేసుకొని రెడీగా ఉన్న ఈ చిత్రం.. ఇప్పుడు ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. ఈ చిత్రం అక్కడికి వెళ్లడంతో.. ఆ డేట్ లో ఉన్న డీజే టిల్లు 2, యాత్ర 2 వాయిదా పడనున్నాయి.
గుంటూరు కారం..
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'గుంటూరు కారం' జనవరి 12న రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది.
హనుమాన్..
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలయికలో వస్తున్న సూపర్ హీరో మూవీ 'హనుమాన్' కూడా జనవరి 12నే రిలీజ్ కానుంది.
సైంధవ్..
శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వెంకటేష్ 75వ చిత్రం 'సైంధవ్' జనవరి 13న రిలీజ్ కావడానికి రెడీగా ఉంది.
నా సామిరంగ..
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'నా సామిరంగ' జనవరి 14న విడుదల కాబోతుంది.
ఈ నాలుగు సినిమాలు ఈ ఏడాది సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నాయి. ఇక తమిళ చిత్రాలు శివకార్తికేయన్ అయలాన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్.. తమిళనాట రిలీజ్ అవుతున్నాయి. కానీ తెలుగులో ఎక్కువ సినిమాలు రిలీజ్ ఉండడంతో తరువాత రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Next Story