Tue Dec 24 2024 03:13:49 GMT+0000 (Coordinated Universal Time)
థియేటర్ లో అమరన్ సినిమా.. పెట్రోల్ బాంబులు విసిరారు
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఇద్దరు గుర్తుతెలియని
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఓ థియేటర్పై మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. శివకార్తికేయన్ నటించిన అమరన్ చిత్రంలో ముస్లింలను ప్రతికూలంగా చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పలు సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడి జరిగింది. అలంగర్ సినిమాస్లో ఈ చిత్రం ప్రదర్శించబడుతోంది. సెకండ్ షో సమయంలో ఈ పెట్రోల్ బాంబులు వేసినట్లు తెలుస్తోంది.
తదుపరి విచారణ తర్వాత దాడి వెనుక ఖచ్చితమైన ఉద్దేశ్యాన్ని నిర్ధారిస్తామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. శుక్రవారం నాడు స్థానికుల మధ్య జరిగిన వివాదానికి ఈ ఘటనకు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి పారిపోయే ముందు ఇద్దరు వ్యక్తులు థియేటర్పై పెట్రోల్ బాంబులు విసిరినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. అదృష్టవశాత్తూ, ఈ దాడిలో ఎటువంటి నష్టం జరగలేదు. విచారణ కొనసాగుతోందని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
Next Story