Mon Dec 23 2024 02:05:25 GMT+0000 (Coordinated Universal Time)
డిసెంబర్ 9న ఓటీటీ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్ మెంట్.. యశోద సహా 4 సినిమాలు స్ట్రీమింగ్
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. డిసెంబర్ 9 నుండి స్ట్రీమ్ చేసేందుకు రెడీ అయ్యారు. యశోద సినిమాతో పాటు
డిసెంబర్ 9న.. ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. వాటిలో ఓటీటీ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా యశోద. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఈ సినిమా.. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాను దర్శకద్వయం హరి-హరీశ్‌లు తెరకెక్కించగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఇక ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపారు.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. డిసెంబర్ 9 నుండి స్ట్రీమ్ చేసేందుకు రెడీ అయ్యారు. యశోద సినిమాతో పాటు అదే రోజున మరో మూడు సినిమాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్కు రానున్నాయి. యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం' జీ5లో, అల్లు శిరీష్-అను ఇమ్మాన్యుయేల్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో', ఆహాలో సంతోష్ శోభన్ నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' సోనీ లివ్ లో అదే రోజున స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఓటీటీలో హిట్టవుతుందో చూడాలి.
Next Story