ఈ 31న సినీ ప్రేక్షకులకు పండగే..!
ఈ శుక్రవారం అంటే 31న ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్జీకే, సువర్ణ సుందరి, ఫలక్ నుమా దాస్, అభినేత్రి 2, గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ [more]
ఈ శుక్రవారం అంటే 31న ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్జీకే, సువర్ణ సుందరి, ఫలక్ నుమా దాస్, అభినేత్రి 2, గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ [more]
ఈ శుక్రవారం అంటే 31న ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్జీకే, సువర్ణ సుందరి, ఫలక్ నుమా దాస్, అభినేత్రి 2, గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మధ్య ఈ శుక్రవారం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో చిన్న సినిమాలకి థియేటర్స్ దక్కట్లేదని చర్చలు జరుగుతున్నాయి. వీటిలో ఫలక్ నుమా దాస్, సువర్ణ సుందరి స్ట్రెయిట్ సినిమాలు. మిగతా మూడూ డబ్బింగ్ సినిమాలు. అయితే ఉన్న ఐదు సినిమాల్లో సూర్య – సెల్వ రాఘవన్ మూవీ 'ఎన్ జీకే'కి థియేటర్ల సమస్య తలెత్తకుండా కె.కె.రాధామోహన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యాకప్ తో వస్తున్న ఫలక్ నుమా దాస్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ కి రానా – నాని లాంటి స్టార్లు రావడంతో మూవీపై మరింత అంచనాలు పెరిగాయి. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
డబ్బింగ్ సినిమాలు కూడా…
మరోవైపు ప్రభుదేవా – తమన్నా కాంబినేషన్ మూవీ అభినేత్రిపై అంచనాలేవీ లేకపోయినా మిల్కీ వైట్ బ్యూటీ గ్లామర్ షో గురించి జనం అంతోఇంతో మాట్లాడుకుంటున్నారు. వీటితో పాటు జయప్రద – పూర్ణ- సాక్షి చౌదరి తారాగణంగా తెరకెక్కించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'సువర్ణ సుందరి' వీటితో పాటే బరిలో దిగుతోంది. అయితే దీనికి తక్కువ థియేటర్స్ ఇచ్చారు. ఈ నాలుగింటితో పాటు హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'గాడ్జిల్లా 2' బరిలో దిగుతోంది. ఈ మూవీని ఇండియాలో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లను రియల్ 3డీ- ఐమ్యాక్స్ 3డీలో రిలీజ్ చేస్తుండడంతో ఆ మేరకు మల్టీప్లెక్సుల్లో విపరీతమైన క్రేజు నెలకొంది. దాదాపు 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కించారు. ఈ మూవీ ఎక్కువ మల్టీప్లెక్సుల్లో రిలీజ్ అవ్వడంతో చిన్న సినిమాలకి థియేటర్స్ కోత తప్పడం లేదు.